శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం సింహాచలం. * ఆనందగజపతిరాజు సేవలు చిరస్మరణీయం * 76వ జయంతి సందర్భంగా ఘన నివాళి.. * ప్రతిభావంతులైన విద్యార్థికి రూ.5 వేల ప్రోత్సాహకం
సింహాచలం, జూలై 17 శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం పూర్వపు చైర్మన్, కీర్తిశేషులు డా. పూసపాటి ఆనందగజపతిరాజు 76వ జయంతిని శుక్రవారం స్వామివారి కొండ దిగువనున్న దేవస్థానం పరిపాలన భవనంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి ఆలయ కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకటరావు, ధర్మకర్త మండలి సభ్యులు మధుపాడ సన్యాసిరావు, అధికారులు, ఉద్యోగులు పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు.
ఆనందగజపతిరాజు స్మారకార్థం ప్రతి సంవత్సరం అందజేస్తున్న విద్యా ప్రోత్సాహక బహుమతిలో భాగంగా దేవస్థానం సంస్కృత ఉన్నత పాఠశాలలో పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థికి రూ.5,000 నగదు బహుమతిని అందజేశారు.
ఆలయ కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకటరావుతో పాటు ధర్మకర్త మండలి సభ్యులు మధుపాడ సన్యాసిరావు, కరక దేముడు సంయుక్తంగా విద్యార్థిని, వారి తల్లిదండ్రులను అభినందించి నగదు బహుమతి అందజేశారు.ఉన్నత విద్యలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా ఆలయ ఈవో మాట్లాడుతూ, విద్యావేత్తగా, సింహాచల దేవస్థానం ధర్మకర్తగా డా. పూసపాటి ఆనందగజపతిరాజు అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ముఖ్యంగా సింహాచల క్షేత్రానికి సంబంధించిన అనేక సాహిత్య గ్రంథాల ప్రచురణకు విశేష కృషి చేసి భక్తులకు విలువైన ఆధ్యాత్మిక సంపదను అందించారని గుర్తుచేశారు.కార్యక్రమంలో సహాయ కార్యనిర్వహణాధికారి వాడ్రేవు రమణమూర్తి, ఐ/సి డిప్యూటీ ఇంజనీర్ రామరాజు, పర్యవేక్షకులు కంచి మూర్తి, సత్యవాణి, రాజ్యలక్ష్మి, గాయత్రి, రమణ, మూలవాసు, వేదపండితులు, దేవస్థానం అధికారులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.




Comments
Post a Comment