Skip to main content

శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం సింహాచలం దేవస్థానం భూముల పరిరక్షణకు చర్యలు వెంకటాపురం సర్వే నంబర్‌ 84లో దేవస్థానం భూములకు రక్షణ బోర్డు ఏర్పాటు.

.                     K.V.SHARMA EDITOR 
సింహాచలం, జూలై 21:దేవస్థానానికి చెందిన భూముల పరిరక్షణకు శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానం ఇఓ జల్లేపల్లి వెంకట్రావు వారి ఆదేశాల మేరకు అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా నేడు దేవస్థానం స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ శ్రీమతి మధులత ఆధ్వర్యంలో ల్యాండ్‌ ప్రొటెక్షన్‌ బృందం వెంకటాపురం పరిధిలోని సర్వే నంబర్‌ 84లో దేవస్థానానికి చెందిన భూములను పరిశీలించి, వాటి పరిరక్షణకు చర్యలు చేపట్టింది.

భూములు దేవస్థానానికి చెందినవని తెలియజేస్తూ హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు. దేవస్థాన భూములను ఎవరైనా ఆక్రమించినా, అనధికారికంగా వినియోగించినా, కొనుగోలు లేదా విక్రయాలకు ప్రయత్నించినా చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేశారు.

దేవస్థానం భూముల పరిరక్షణలో భాగంగా నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పర్యవేక్షణ అధికారి లక్ష్మణరావు, ల్యాండ్‌ ప్రొటెక్షన్‌ సిబ్బంది రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.

Comments