Skip to main content

ఎస్‌ఐఆర్ ప్రక్రియలో విశాఖ జిల్లా స‌మ‌గ్ర ప్ర‌గ‌తి* *శతశాతం ఫారాల పంపిణీ పూర్తి... 97.53 శాతం డిజిటైజేష‌న్ తో ముందంజ *ఒక్క రోజు గ‌డువును ప్ర‌జ‌లు స‌ద్వినియోగం చేసుకోవాల‌న్ని జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిశోర్

 


విశాఖపట్నం, జూలై 13: ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియలో విశాఖపట్నం జిల్లా వేగంగా పురోగతి సాధించింద‌ని జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం 6 గంటల నాటికి జిల్లాలో మొత్తం 20,23,009 మంది ఓటర్లలో 19,72,971 దరఖాస్తులు డిజిట‌లైజేష‌న్ పూర్తికాగా, మొత్తం 97.53 శాతం ప్రగతి నమోదైందని వెల్లడించారు. జిల్లాలో ఇప్పటివరకు 17,76,335 ఎన్యుమరేషన్ ఫారాలు (87.81 శాతం) డిజిటలైజేషన్ పూర్తయ్యాయని, అదనంగా 26,311 యూనిక్ ఎన్యూమరేషన్ ఫారాలు సేకరించడం ద్వారా మొత్తం ప్రక్రియలో గణనీయమైన పురోగతి సాధించినట్లు తెలిపారు. ప్రస్తుతం 78,990 ఫారాలు (3.90 శాతం) డిజిటలైజేషన్ దశలో ఉన్నాయని ప్ర‌క‌ట‌న ద్వారా చెప్పారు. 


జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోందని, పెందుర్తి నియోజకవర్గంలో 91.85 శాతం, విశాఖ తూర్పులో 90.15 శాతం, భీమిలిలో 89.94 శాతం, విశాఖ దక్షిణంలో 88.39 శాతం, విశాఖ ఉత్తరంలో 86.52 శాతం, విశాఖ పశ్చిమంలో 84.56 శాతం, గాజువాకలో 82.44 శాతం డిజిటలైజేషన్ పూర్తైందని కలెక్టర్ తెలిపారు. ఇప్పటికీ సేకరణకు మిగిలిన ఫారాలను క్షేత్రస్థాయిలో ప్రత్యేక బృందాల ద్వారా సేకరించి, డిజిటలైజేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సంబంధిత ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారులు, సహాయ ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారులు, బూత్ స్థాయి అధికారుల‌ను ఆదేశించినట్లు పేర్కొన్నారు. జూలై 14వ తేదీ సాయంత్రం వ‌ర‌కు ఈఎఫ్ ప‌త్రాలు వెన‌క్కి ఇచ్చేందుకు గ‌డువు ఉంద‌ని, ఈ అవ‌కాశాన్ని ప్ర‌జ‌లు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ సూచించారు.

Comments