2015 జూలై 27న షిల్లాంగ్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM)లో విద్యార్థులను ఉద్దేశించి ఉపన్యాసం ఇస్తుండగా హటాత్తుగా గుండెపోటు రావటంతో ఆయన అక్కడకక్కడే తుదిశ్వాస విడిచారు.
అబ్దుల్ కలాం గొప్ప శాస్త్రవేత్త, 1960లో DRDO (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్) లో శాస్త్రవేత్తగా చేరారు.
తదుపరి 1969 లో, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థలో (ఇస్రో) చేరిన కలాం ముఖ్యంగా మొదటి స్వదేశీ ఉపగ్రహ ప్రయోగ వాహనం (SLV-III) అభివృద్ధిలో ఆయన ముఖ్యమైన పాత్ర పోషించారు.
అగ్ని, పృథ్వీ, ఆకాశ్ క్షిపణులతో సహా భారతదేశ బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాన్ని అభివృద్ధి చేయడంలో కలాం కీలక పాత్ర పోషించారు. ఈ రంగంలో ఆయన చేసిన కృషికి గాను ఆయనను "భారతదేశ క్షిపణి మనిషి (Missile Man of India") గా పేర్కొంటారు.
1998లో భారతదేశ అణ్వస్త్ర సామర్థ్యాలను ప్రదర్శించిన పోఖ్రాన్-II అణు పరీక్షలలో కలాం కీలక పాత్ర పోషించారు.
విజన్ 2020లో భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి అభివృద్ధి ప్రణాళికలు సూచించారు.
అబ్దుల్ కలాం 2002 నుండి 2007 వరకు భారత దేశ పదకొండవ రాష్ట్రపతి గా సేవలందించారు.
ఆయన 'ప్రజల రాష్ట్రపతి'గా పేరు పొందారు.1997 లో భారతదేశపు అత్యున్నత పౌర భారతరత్నతో సహా అనేక ప్రతిష్ఠాత్మక అవార్డులను ఆయన అందుకున్నారు.

Comments
Post a Comment