ప్రపంచ టూ వీలర్స్ సృష్టికర్త గాట్లీబ్ డైమ్లర్ కి బైక్ మెకానికులు ఘనంగా నివాళులు..అమలాపురంలో ఘనంగా ప్రపంచ టూ వీలర్స్ మెకానిక్స్ దినోత్సవం.... .
SRINIVAS SPL Correspondant
అమలాపురం, విశాఖ సందేసం....అమలాపురం పట్టణంలో ప్రపంచ టూ వీలర్స్ మెకానిక్స్ దినోత్సవ వేడుకలను శ్రీ సిద్ధి వినాయక టూ వీలర్స్ మెకానిక్స్ అసోసియేషన్' అధ్యక్షులు సాధనాల సత్తిబాబు ఆధ్వర్యంలో శుక్రవారం ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గడియార స్తంభం సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో ముందుగా మెకానిక్ వృత్తి ప్రతిబింబించే పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మెకానిక్ ల సమక్షంలో కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో గన్నవరం మెకానిక్స్ యూనియన్ అధ్యక్షులు గుడాల గంగాధరం, అమలాపురం పట్టణ, రూరల్ పరిసర ప్రాంతాల నుండి విశేష సంఖ్యలో మెకానిక్ లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రపంచ టూ వీలర్స్ సృష్టికర్త గాట్లీబ్ డైమ్లర్ కి బైక్ మెకానికులు ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన చూపించిన చొరవ, సాంకేతిక స్ఫూర్తి కారణంగానే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది మెకానిక్ వృత్తిని నమ్ముకుని గౌరవప్రదంగా జీవనోపాధి సాగిస్తున్నారని ఈ సందర్భంగా పలువురు కొనియాడారు. ఈ వేడుకల్లో అసోసియేషన్ సభ్యులు పట్నాల వెంకట రమణ, కాండ్రేగుల కృష్ణ, పప్పుల రమణ, నల్లా శ్రీను, సుబ్బారావు, ముత్తా భాస్కరరావు, ఎస్.కె. మస్తాన్, ముత్తా సత్యశ్రీను తదితర మెకానిక్ లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Comments
Post a Comment