Skip to main content

అగ్గిపిడుగు అల్లూరి సీతారామరాజు ఆశయ* *సాధనకు గిరిజన యువత ముందుకు రావాలి –* . *ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాచిపెంట శాంతకుమారి*

 


అగ్గిపిడుగు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా అరకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాచిపెంట శాంతకుమారి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన త్యాగాలను, దేశభక్తిని, గిరిజనుల హక్కుల కోసం సాగించిన వీరోచిత పోరాటాన్ని స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా శ్రీమతి పాచిపెంట శాంతకుమారి మాట్లాడుతూ, బ్రిటిష్ పాలకుల అణచివేతకు ఎదురొడ్డి గిరిజనుల ఆత్మగౌరవం, స్వాభిమానాన్ని కాపాడేందుకు ప్రాణత్యాగం చేసిన మహావీరుడు అల్లూరి సీతారామరాజు భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. ఆయన పోరాట స్ఫూర్తి నేటి తరానికి స్ఫూర్తిదాయకమని, ప్రతి గిరిజన యువకుడు ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.

నేడు ఐదో షెడ్యూల్ ప్రాంతాల్లో గిరిజనుల భూములు, అటవీ హక్కులు, ఉపాధి, విద్య, ఉద్యోగ అవకాశాలు, రాజ్యాంగబద్ధ హక్కుల పరిరక్షణ కోసం అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. పోడు భూముల హక్కులు, అటవీ హక్కుల చట్టం, పీసా చట్టం, జీవో నెం.3 అమలు, షెడ్యూల్డ్ ప్రాంతాల్లో గిరిజనుల రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం గిరిజన యువత ముందుండి పోరాటాన్ని బలోపేతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు.


గిరిజనుల అభివృద్ధి పేరుతో వారి జల–జంగల్–జమీన్ హక్కులకు భంగం కలిగించే ఏ చర్యనైనా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. గిరిజనుల భూములు, అటవీ సంపద, సహజ వనరులను హరించే నిర్ణయాలను ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రతిఘటించి, గిరిజనుల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.

అల్లూరి సీతారామరాజు ఆశయాలను ఆచరణలో పెట్టడమే ఆయనకు నిజమైన నివాళి అని పేర్కొంటూ, గిరిజన సమాజం ఐక్యంగా నిలబడి తమ రాజ్యాంగబద్ధ హక్కులను చట్టబద్ధంగా సాధించుకునే దిశగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.


ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, గిరిజన నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుకు ఘనంగా నివాళులర్పించారు. :::**

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాచి పెంట చిన్నస్వామి కిల్లో జగనథం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

"అల్లూరి ఆశయాలే గిరిజన హక్కుల సాధనకు మార్గం – గిరిజన యువత పోరాటానికి సిద్ధం కావాలి: పాచిపెంట శాంతకుమారి

Comments