Skip to main content

బ‌హుముఖ ప్ర‌జ్ఞాశాలి బాబు జగ్జీవన్ రామ్ -దేశానికి విలువైన సేవ‌లు అందించారు - ఉపకులపతి ఆచార్య జి. పి. రాజశేఖర్

.                   K.V.SHARMA EDITOR 
ఆంధ్ర విశ్వవిద్యాలయం , జూలై 6: భారత మాజీ ఉపప్రధాని, సామాజిక న్యాయ సాధకుడు, గొప్ప ప్రజానాయకుడు  బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా సోమవారం ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని ఆయన విగ్రహానికి ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జి. పి. రాజశేఖర్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.


ఈ సందర్భంగా ఉపకులపతి ఆచార్య జి. పి. రాజశేఖర్ మాట్లాడుతూ  బాబు జగ్జీవన్ రామ్ దేశ రాజకీయ, సామాజిక రంగాల్లో విశిష్ట సేవలందించిన మహనీయుడని, సామాజిక సమానత్వం, ప్రజాసేవ, రాజ్యాంగ విలువల పరిరక్షణకు ఆయన చేసిన కృషి భావితరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని సమాజాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. బ‌హుముఖ ప్ర‌జ్ఞాశాలిగా బాబు జ‌గ్జీవ‌న్‌రామ్ నిలుస్తార‌న్నారు. ర‌క్ష‌ణ‌, వ్య‌వ‌సాయ రంగాల‌లో ఆయ‌న తీసుకువ‌చ్చిన సంస్క‌ర‌ణ‌లు సాహ‌సోపేతంగా అమ‌లు చేసిన నిర్ణ‌యాలు ఆద‌ర్శ‌నీయ‌మ‌న్నారు. దేశ అభ్యున్న‌తికి గ‌ణ‌నీయ‌మైన సేవ‌లు అందించార‌ని, ఆయ‌న సేవ‌ల‌ను గుర్తుచేసుకుంటూ, ఆశ‌య సాధ‌న దిశ‌గా కృషి చేయాల‌ని సూచించారు.


ఈ కార్యక్రమంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య కె. రాంబాబు, ప్రిన్సిపాల్స్ ఆచార్య కె.సీతామాణిక్యం, ఆచార్య ఆర్‌.ప‌ద్మ‌శ్రీ‌, ఆచార్య డి.న‌గ‌ర రాజ కుమారి, ఆచార్య జాలాది ర‌వి, డీన్లు, ఆచార్యులు, పరిశోధకులు, విద్యార్థులు, ఉద్యోగులు తదితరులు పాల్గొని  బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి నివాళులర్పించారు.

Comments