వన్ టౌన్ నందు ఉన్న శ్రీ స్వామి వివేకానంద ఆశ్రమ వాసులను వివేకానంద సంస్థ నిర్వాహకులు అనకాపల్లి నూకాంబికను దర్శించుకోవడానికి తీసుకుని వెళ్లారు. ఆశ్రమ వాసులు సంతోషంగా నూకాంబిక మాతను దర్శించుకుని, అమ్మ ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. అనంతరం ఆశ్రమ వాసులు అందరూ కలిసి సరదాగా వనభోజనాలను చేసి తిరిగి ప్రయాణమయ్యారు. ఈ సందర్భంగా వివేకానంద సంస్థ నిర్వాహకులు అప్పారావు మాట్లాడుతూ, ఆశ్రమ వాసులు తమకు ఎవరూ లేరని బాధపడకుండా ఉండడానికి, మేమున్నామని భరోసా కల్పిస్తూ ఇలా పుణ్యక్షేత్రాలకు, సినిమాలకు, బీచ్ లకు తీసుకువెళ్తున్నామని, వారి ఆనందమే మా ఆనందమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు సత్తిబాబు, నల్ల రాజు మరియు ఆశ్రమ వాసులు పాల్గొన్నారు.

Comments
Post a Comment