Skip to main content

విద్యార్థినుల్లో వ్యక్తిత్వ వికాసం – విపత్తుల నిర్వహణపై అవగాహన కల్పించిన విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి మహిళా యువజన విభాగం*


విశాఖపట్నం, జూలై 10: విశాఖ శ్రీ సత్యసాయి సేవా సంస్థల మహిళా యువజన విభాగం ఆధ్వర్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రాంతంలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో 240 మందికి పైగా విద్యార్థినుల కోసం వ్యక్తిత్వ వికాసం మరియు విపత్తుల నిర్వహణ అవగాహన కార్యక్రమంఈ రోజు  నిర్వహించారు.


ఈ కార్యక్రమాన్ని *విశాఖ జిల్లా మహిళా యువజన విభాగం, కణితి–వడ్లపూడి–కూర్మన్నపాలెం (కేవీకే) సమితి మరియు ఉక్కునగరం శ్రీ సత్య సాయి సేవా సమితి  మహిళా యువజన సభ్యులు*  సంయుక్తంగా నిర్వహించగా, జిల్లా మహిళా యువజన సమన్వయకర్త శ్రీమతి సోమేశ్వరి సమన్వయం చేశారు.


శ్రీ సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర మహిళా యువజన సమన్వయకర్త, రాష్ట్ర విపత్తుల నిర్వహణ బృందం సీనియర్ సభ్యురాలు శ్రీమతి సాయి కుమారి ప్రథమ చికిత్స, సీపీఆర్ (CPR), రక్షణ పద్ధతులు, గొంతులో ఆహారం ఇరుక్కుపోయినప్పుడు తీసుకోవాల్సిన చర్యలు, మూర్ఛ (ఫిట్స్) వచ్చినప్పుడు చేయాల్సిన సహాయం, అత్యవసర పరిస్థితుల్లో స్పందించే విధానం వంటి అంశాలపై ప్రత్యక్ష ప్రదర్శన ఇచ్చారు. అలాగే వ్యక్తిత్వ వికాసంలో భాగంగా సమయపాలన ప్రాముఖ్యతను వివరించారు.


ఈ సందర్భంగా ఉక్కునగరం శ్రీ సత్య సాయి సేవా సమితి  మహిళా యువత కోఆర్డినేటర్   కుమారి సాయి విద్య భగవాన్ శ్రీ సత్యసాయిబాబా బోధించిన '5 డి'లు – డ్యూటీ (కర్తవ్యం), డిసిప్లిన్ (క్రమశిక్షణ), డివోషన్ (భక్తి), డిస్క్రిమినేషన్ (వివేకం), డిటర్మినేషన్ (దృఢ సంకల్పం) గురించి వివరించారు. ఈ ఐదు విలువలను జీవితంలో ఆచరిస్తే మంచి వ్యక్తిత్వం పెంపొందడంతో పాటు ఆదర్శ పౌరులుగా ఎదగవచ్చని ఆమె పేర్కొన్నారు.


విద్యార్థినులను ఉద్దేశించి మాట్లాడిన  శ్రీ సత్య సాయి సేవా సంస్థల విశాఖ  జిల్లా  మహిళా యువజన సమన్వయకర్త శ్రీమతి సోమేశ్వరి  భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ, క్రమశిక్షణతో చదువుకుని కష్టపడి తమ లక్ష్యాలను సాధించాలని సూచించారు.


240 పైగా విద్యార్థినులు కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని, ప్రదర్శనల్లో చురుకుగా పాల్గొంటూ అనేక సందేహాలను నివృత్తి చేసుకున్నారు.


శ్రీ చైతన్య జూనియర్ కళాశాల డీన్ శ్రీ అనిల్ కుమార్, విద్యార్థినులకు ఎంతో ఉపయోగపడే ఈ విలువలతో కూడిన కార్యక్రమాన్ని నిర్వహించిన శ్రీ సత్యసాయి మహిళా యువజన విభాగాన్ని అభినందించి, కృతజ్ఞతలు తెలిపారు.

Comments