Skip to main content

సమస్యలు పరిష్కరించాలంటూ ఎమ్మెల్యేలు దాట్ల సుబ్బరాజు, గిడ్డి సత్యనారాయణలకు వినతిపత్రాలను అందజేసిన ఏపీజేఏసీ....

.              SRINIVAS SPL Correspondant 
అమలాపురం, విశాఖ సందేసం.....ఏపీజేఏసీ చైర్మన్  అలపర్తి విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శి  రమణ  పిలుపు మేరకు  డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా జేఏసీ తరపున ఏపీ అంగ్గో  ఎన్ జి జి ఓ  జీవో జిల్లా కార్యదర్శి  కోలా  కృష్ణ  ఆధ్వర్యంలో జిల్లా జేఏసీ కార్యవర్గ సభ్యులు, జిల్లా ఎన్ జి జి ఓ కార్యవర్గ సభ్యులు మమ్మిడివరం శాశన సభ్యులు మరియు ప్రభుత్వ విప్  దాట్ల సుబ్బరాజు, పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణలను  కలిసి ఉద్యోగుల పలు డిమాండ్లపై వినతిపత్రాలను అందజేశారు. 


ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళి వెంటనే పి.ఆర్.సి కమీషన్ వేసి ఐ.ఆర్ ప్రకటన, పెండింగ్ లో ఉన్న డి.ఏలు వెంటనే విడుదల చేయించాలని జె ఎ సి నాయకులు సభ్యులు ఎమ్మెల్యేలను కోరారు. ఈ కార్యక్రమంలో అమలాపురం యూనిట్ అధ్యక్షులు  నిమ్మకాయల శ్రీనివాస్,  సంయుక్త కార్యదర్శి అల్లూరి రామరాజు, ముమ్మిడివరం ఎన్జీవో తాలూకా అధ్యక్షులు చిలకా దొర, అమలాపురం జేఏసీ నాయకులు కారం శీను , కాట్రేనికోన జేఏసీ నాయకులు పి పృథ్వి  కాట్రేనికోన ఎంపీడీవో ఆఫీస్ ఏవో సంఘమిత్ర  తదితరులు పాల్గొన్నారు.

Comments