Skip to main content

విద్యార్థులు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండాలి : ట్రస్ట్ అధ్యక్షులు మోసుగంటి వెంకటేశ్వరరావు... విద్యార్థులకు భోజన కంచాలు వితరణ.....

.             SRINIVAS SPL Correspondant 
అల్లవరం, విశాఖ సందేసం...అల్లవరం మండలం బెండమూర్లంక గ్రామం  మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు మోసుగంటి గంగయ్య మెమోరియల్ ఎడ్యుకేషనల్ అండ్ ఛార్టిబుల్ ట్రస్ట్ కొమరగిరిపట్నం  మధ్యాహ్న భోజనం చేయడానికి స్టీల్ కంచాలను శుక్రవారం  పంపిణీ చేశారు. 


ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు యస్.సత్యనారాయణ, ట్రస్ట్ అధ్యక్షులు మోసుగంటి.వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు కుసుమ రమేష్ బాబు, రుద్రరాజు రమేష్ రాజు, విద్యా కమిటీ ఛైర్మన్ ముసునూరి భవాని,ఉపాధ్యాయురాలు దుర్గాభవాని,చుట్టుగుళ్ళ.రాముడు,గ్రామ పెద్దలు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. 


విద్య ద్వారానే ఎదగగలమని, విద్యార్థుల చదువు పట్ల తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలని సోషల్ మీడియా వేదికను పంచుకొనే టివి ఛానళ్ళుకు, మొబైల్ ఫోన్లలకు విద్యార్థులను దూరంగా ఉంచాలని వెంకటేశ్వరరావు హితవు పలికారు. ఈ పాఠశాల విద్యార్థులకు స్టీల్ కంచాలు వితరణ చేయడం పట్ల ప్రధానోపాధ్యాయులు, గ్రామ పెద్దలు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు మోసుగంటి గంగయ్య ట్రస్ట్ సేవలను కొనియాడారు.

Comments