Skip to main content

హెచ్పీవీ వ్యాక్సిన్ తోనే సర్వైకల్ క్యాన్సర్ నియంత్రణ: పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చీ


విశాఖపట్నం జూలై 11  హ్యూమన్ పాపిలోమా వైరస్ వల్ల మహిళల్లో వచ్చే సర్వయికల్ క్యాన్సర్ ను సెర్వావ్యాక్ వ్యాక్సిన్ వేయడం ద్వారానే  నియంత్రించ గలమని  పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖ బ్రత బాగ్చీ చెప్పారు. నాట్కో ట్రస్ట్,లయన్స్ క్లబ్ ఆఫ్ వైజాగ్ చారిటబుల్ ట్రస్ట్,చైతన్య స్రవంతి స్వచ్ఛంద సేవా సంస్థ సంయుక్తంగా పోలీస్ బ్యారేక్స్ లోని టెంపుల్ ఆఫ్ లెర్నింగ్ హాల్లో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 9నుండి 14ఏళ్ల లోపున్న ఆడపిల్లకు హెచ్పీవీ బూస్టర్ డోస్ వ్యాక్సిన్ వేసే కార్యక్రమాన్ని పోలీస్ కమిషనర్ మరియు చైతన్య స్రవంతి అధ్యక్షురాలు డాక్టర్ షిరీన్ రహమాన్ ప్రారంభించారు.రెండు రోజులు పాటు ఈ శిబిరం జరుగుతుంది. మొత్తం 500 మంది పోలీసుల పిల్లలకు ఈ వ్యాక్సిన్ వేస్తారు ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ పోలీసులకు చెందిన ఆడపిల్లలకు క్యాన్సర్ వ్యాక్సిన్ వేసేందుకు ముందుకొచ్చిన సంస్థలకు ధన్యవాదాలు తెలియజేశారు.ఈ బూస్టర్ డోసు  ద్వారా జ్వరం వచ్చినట్లయితే డాక్టర్ షిరీన్ రహమాన్ ను సంప్రదించాలని మొదటి డోసు వేయడం ద్వారా ఎటువంటి ఇబ్బందులు రానందున 


ఈ విడత కూడా ఆడపిల్లకు ఏ సమస్య ఉండదని అన్నారు.ఈ డోస్ వేయడంతో ఆడపిల్లలు పెరిగి పెద్దయ్యాక కూడా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వచ్చే ప్రమాదం లేదని కమిషనర్ పేర్కొన్నారు చైతన్య స్రవంతి స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు డాక్టర్ షిరీన్ రహమాన్ మాట్లాడుతూ 9 నుండి 14 ఏళ్ల లోపున్న ఆడపిల్లలకు రెండు డోసులు ఆ పై వయసుగల వారైతే మూడు డోసులు వేయాలన్నారు.పోలీసులకు చెందిన మహిళల్లో  బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కల్పించేందుకు అక్టోబర్లో ఒక శిబిరం ఏర్పాటు చేయమని పోలీస్ కమిషనర్ను ఆమె కోరారు సర్వయికల్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ రెండు ప్రమాదకరమైనవి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో డీసీపీ పాపారావు ఏడీసీపీ అడ్మిన్ రామచంద్రరావు లయన్స్ క్లబ్ కార్యదర్శి బి. రవిచంద్ర డాక్టర్ సత్యవేణి, చైతన్య స్రవంతి ఉపాధ్యక్షులు విజయ్ శేఖర్ తనయుడు  అవినీస్, సీరం ఇనిస్టిట్యూట్ ఏరియా మేనేజర్ రాం రతన్  తదితరులు పాల్గొన్నారు ముందుగా పోలీస్ కమిషనర్ను డాక్టర్ షిరీన్ రహమాన్ ఘనంగా సన్మానించారు.

Comments