Skip to main content

కనులవిందుగా శ్రీ సత్యనారాయణస్వామివారి కల్యాణం.... అమలాపురంలో సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు.....

.            SRINIVAS SPL Correspondant 
అమలాపురం, విశాఖ సందేసం.....అమలాపురంలో శ్రీ సత్యసాయి కళ్యాణమండపంలో లోకా స్సమస్తా స్సుఖినో భవంతు ఆధ్యాత్మిక సేవా సంస్థ వారిచే, ప్రముఖ వాస్తు, జ్యోతిష్య, ఆధ్యాత్మిక వేత్త రేలంగి కుమార్ శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో లోక కళ్యాణార్ధం భారతదేశ ఆర్థికాభివృద్ధి, ఉభయ తెలుగు రాష్ట్రాల దినదినాభివృద్ది,


 ప్రజలందరికీ ధన, ధాన్య, ఆరోగ్య సిద్ధి సంకల్పంగా శ్రీ అనంత లక్ష్మీ సత్యవతీ దేవి సమేత శ్రీ వీర వేంకట సత్యనారాయణమూర్తి స్వామి వారి దివ్య కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవోపేతంగా జరిగింది. వేద పండితుల వేద మంత్రోచ్చరణ, కన్యాదానం, జీలకర్ర బెల్లంతో దేవతా మూర్తుల వివాహ ఘట్టం, మంగళ సూత్ర ధారణ, తలంబ్రాల సన్నివేశాలకు భక్తులు భక్తి తన్మయత్వం పొందారు. శ్రీ సత్యదేవుని నామ ప్రాధాన్యత, కల్యాణ మహోత్సవంలో వివిధ ఘట్టాల అంతరార్ధాలను కుమార్ శంకర్ గౌడ్ వివరించారు. ఏవిధమైన టికెట్ రుసుము, దక్షిణలు, హుండీలు లేకుండా భక్తులకు ఉచితంగా అవకాశం కల్పించారు


. స్వామివారి కల్యాణం వీక్షించుటకు అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసారు. టి.డి.పి నాయకులు పెచ్చెట్టి చంద్రమౌళి విచ్చేసి పూజాధి కార్యక్రమంలో పాల్గొని సత్యదేవుని దర్శించుకున్నారు


.ఈ కార్యక్రమంలో      గోరుగంతు సీతారామం, వక్కలంక నాని శర్మ, రామేశ్వరపు మణికంఠ, అయినవిల్లి నాగేంద్రకుమార్, గువ్వాల అచ్యుతరామయ్య, పలివెల అప్పారావు, దంగేటి అప్పారావు,పితాని నాని,. జి. తిరుపతి రావు, దంగేటి మహేష్, నల్లా వేణుగోపాలరావు,శ్రీ విజయ త్రిముఖ గణపతి ఆలయ కమిటీ సభ్యులు సేవలు అందించారు. అనంతరం భక్తులకు  భారీ అన్న సమారాధన నిర్వహించారు.

Comments