ఆరోగ్య సేవలో మరో మైలురాయి- శ్రీకాకుళంలో శ్రీ సత్యసాయి ఉచిత ఫిజియోథెరపీ కేంద్రం ప్రారంభం-రాష్ట్రంలోనే తొలి ఉచిత అత్యాధునిక ఫిజియోథెరపీ కేంద్రం – రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రఘుపాత్రుని లక్ష్మణరావు*
. K.V.SHARMA EDITOR
శ్రీకాకుళం, జూలై 8: భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, శ్రీకాకుళం నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయం ఎదురుగా గల శ్రీ సత్యసాయి మందిర నూతన భవనంలో "శ్రీ సత్యసాయి ఉచిత ఫిజియోథెరపీ కేంద్రం"ను శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రఘుపాత్రుని లక్ష్మణరావు గారు ఈరోజు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "అందరినీ ప్రేమించండి... అందరినీ సేవించండి" అనే భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సందేశాన్ని ఆచరణలోకి తీసుకువచ్చే మరో సేవా కార్యక్రమంగా ఈ ఉచిత ఫిజియోథెరపీ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఈ కేంద్రం రాష్ట్రంలోనే మొట్టమొదటి ఉచిత శ్రీ సత్యసాయి ఫిజియోథెరపీ కేంద్రం అని పేర్కొంటూ, ఇందులో అత్యాధునిక ఫిజియోథెరపీ పరికరాలను ఏర్పాటు చేయడంతో పాటు మహిళలు, పురుషులకు ప్రత్యేక విభాగాలను కల్పించినట్లు వివరించారు.
శ్రీకాకుళం నగరంతో పాటు జిల్లా ప్రజలందరూ ఎటువంటి రుసుము చెల్లించకుండా ఈ సేవలను వినియోగించుకొని ఆరోగ్యవంతమైన జీవితం గడపాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో శ్రీమతి కమలా త్రివేణి గారు, డాక్టర్ బాలకృష్ణ గారు, శ్రీ విశ్వనాథం గారు, శ్రీ సత్యసాయి సేవా సంస్థల శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు శ్రీ సూర రామచంద్రరావు – శ్రీమతి పుణ్యావతి దంపతులు, జిల్లా పదాధికారులు శ్రీ బోయిన నరసింహమూర్తి గారు, శ్రీ టి.ఎస్.ఎన్. మూర్తి గారు, శ్రీ బి. అప్పారావు గారు, శ్రీమతి లలిత గారు, శ్రీమతి సుజాత గారు, శ్రీ రమణమూర్తి గారు, శ్రీ శివన్నారాయణ గారు, శ్రీ పార్వతీశం గారు, శ్రీ జగన్మోహనరావు గారు, కన్వీనర్లు శ్రీ కె. భాస్కరరావు గారు, శ్రీ కె. మురళీకృష్ణ గారు, శ్రీ ఎ. ప్రసాద్ రావు గారు, శ్రీ వల్లభ నారాయణ గారు, శ్రీ తబలా ప్రసాద్ గారు తదితరులు పాల్గొన్నారు.

ఈ కేంద్ర నిర్వహణ కోసం ఫిజియోథెరపీలో మాస్టర్స్ డిగ్రీ పొందిన డాక్టర్ ప్రసాద్ గారిని నియమించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో శ్రీమతి కమలా త్రివేణి గారు, డాక్టర్ బాలకృష్ణ గారు, శ్రీ విశ్వనాథం గారు, శ్రీ సత్యసాయి సేవా సంస్థల శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు శ్రీ సూర రామచంద్రరావు – శ్రీమతి పుణ్యావతి దంపతులు, జిల్లా పదాధికారులు శ్రీ బోయిన నరసింహమూర్తి గారు, శ్రీ టి.ఎస్.ఎన్. మూర్తి గారు, శ్రీ బి. అప్పారావు గారు, శ్రీమతి లలిత గారు, శ్రీమతి సుజాత గారు, శ్రీ రమణమూర్తి గారు, శ్రీ శివన్నారాయణ గారు, శ్రీ పార్వతీశం గారు, శ్రీ జగన్మోహనరావు గారు, కన్వీనర్లు శ్రీ కె. భాస్కరరావు గారు, శ్రీ కె. మురళీకృష్ణ గారు, శ్రీ ఎ. ప్రసాద్ రావు గారు, శ్రీ వల్లభ నారాయణ గారు, శ్రీ తబలా ప్రసాద్ గారు తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment