Skip to main content

రియల్ ఎస్టేట్ అభివృద్ధికి అనువైన ప్రాంతాల్లో సహాయ సహకారాలు అందిస్తాం: ఎమ్మెల్యే ఆనందరావు క్రెడాయి ఆధ్వర్యంలో *వరల్డ్ గ్రీన్ డే* మొక్కలు నాటిన ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ఆనందరావు....

 

         SRINIVAS SPL Correspondant 
అమలాపురం, విశాఖ సందేసం....వరల్డ్ గ్రీన్ డే సందర్భంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని గరిగుంట చెరువు పార్క్‌లో నిర్వహించిన మొక్కల నాటే కార్యక్రమంలో అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పాల్గొన్నారు. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ క్రెడాయ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా చెట్లను నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందరావు  మాట్లాడుతూ, పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో మొక్కల పాత్ర ఎంతో కీలకమని, ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని సూచించారు.

అలాగే రాష్ట్ర అభివృద్ధిలో బిల్డర్స్, డెవలపర్స్ పాత్ర కూడా కీలకమని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్మాణ రంగానికి మరిన్ని అవకాశాలు కల్పించే దిశగా చర్యలు చేపడుతోందన్నారు. అమలాపురం పట్టణంలో రియల్ ఎస్టేట్ అభివృద్ధికి అనువైన ప్రాంతాల్లో ప్రభుత్వ తరఫున అవసరమైన సహకారం అందిస్తామని ఎమ్మెల్యే ఆనందరావు తెలిపారు.


ఈ కార్యక్రమంలో ఆముడా చైర్మన్ అల్లాడ స్వామి నాయుడు, మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్ ,మార్కెట్ యార్డ్ చైర్మన్ అధికార జయలక్ష్మి ,క్రెడాయి అమలాపురం చాప్టర్ అధ్యక్షులు ఎం ఎన్ వి ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం లో క్రెడియి  అమలాపురం సభ్యులు సుంకర నాయుడు, ముద్రగడ తాసు, చిక్కం సుబ్రహ్మణ్యం, ఎరుబండి నాని, తాడి నరసింహారావు, రేకపల్లి సోము, రవణం చిట్టి, బోనం సత్తిబాబు,మోకా సుబ్బారావు, అడపా శ్రీనివాస్, ఇదల సాయి, నూకల బులి నాయుడు, సుదా చిన్నా, చిక్కం కిట్టు,రవణం కాసు, సుబ్బారావు, కానిపూడి రమేష్, కాయల వీరబాబు తదితరులు పాల్గొన్నారు

Comments