Skip to main content

ఏయూను సంద‌ర్శించిన బిటిహెచ్ బృందం డ్యూయ‌ల్ పి.హెచ్‌.డి ప్రోగ్రాం నిర్వ‌హ‌ణ‌పై చ‌ర్చ‌ ఏయూతో అనుబంధాన్ని అభినందించిన బిటిహెచ్ ప్ర‌తినిధులు

.                 K.V.SHARMA  EDITOR 
ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం,జూలై14:ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యాన్ని స్వీడ‌న్‌లోని బ్లికింగ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌(బిటిహెచ్‌) ప్ర‌తినిధి బృంధం సంద‌ర్శించింది. బిటిహెచ్ డిప్యూటి వైస్ చాన్స‌ల‌ర్ వంజ లిండ్‌బ‌ర్గ్‌, డీన్‌-ఫ్యాక‌ల్టీ ఆఫ్ కంప్యూటింగ్ ఆచార్య లార్స్ లంబ‌ర్గ్‌, డీన్‌-ఫ్యాక‌ల్టీ ఆఫ్ ఇంజ‌నీరింగ్ ఆచార్య మార్టిన్ ఏండ‌ర్‌స‌న్‌, ఇంట‌ర్నేష‌న‌ల్ డైరెక్ట‌ర్ గుర‌ద‌త్ వేల్పుల‌తో కూడిన ప్ర‌తినిధుల బృందం, ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజశేఖ‌ర్‌ మరియు ఏయూ అధికారుల‌తో పాల‌క మండ‌లి స‌మావేశ మందిరంలో స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా రెండు విశ్వ‌విద్యాల‌యాలు సంయుక్తంగా డ్యూయ‌ల్ పి.హెచ్‌.డి ప్రోగ్రాం నిర్వ‌హించే అంశాల‌పై సుదీర్ఘంగా చ‌ర్చించారు. ప‌రిశోధ‌క విద్యార్థుల ఎంపిక‌, రెండు విశ్వ‌విద్యాల‌యాలో సంయుక్తంగా ప‌రిశోధ‌న జ‌రిపి, డిగ్రీల‌ను అందించే విధానం త‌దిత‌ర అంశాల‌పై ప్రాధ‌మికంగా చ‌ర్చించారు. దీనికి అవ‌స‌ర‌మైన విభాగాలు, ఫ్యాక‌ల్టీ, రీసెర్చ్ గ్రూప్ సిద్దం చేసుకోవ‌డం త‌దిత‌ర అంశాల‌ను, సాధ్యాసాధ్యాల‌ను రెండు విశ్వ‌విద్యాల నుంచి త‌మ సామ‌ర్ధ్యాల‌ను రెండు విశ్వ‌విద్యాల‌యాల ప్రతినిధులు  చ‌ర్చించారు.


స‌మావేశంలో భాగంగా ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజ‌శేఖ‌ర్ ఏయూ విశిష్ట‌త‌ను వివ‌రించారు. ఏయూలో ఉన్న సెంట‌ర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌, ఇంక్యుబేష‌న్‌, స్టార్ట‌ప్‌, స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ కేంద్రాల‌కు సంబంధించిన వివ‌రాలు బిటిహ‌చ్ ప్ర‌తినిధుల‌కు తెలియ‌జేస్తూ వీటిని సంద‌ర్శించాల‌ని వారిని ఆహ్వానించారు. అదే విధంగా ఏయూలో 56 దేశాల‌కు చెందిన 1100మందికిపైగా విదేశీ విద్యార్థులు ఉన్న‌త విద్య‌ను అభ్య‌శిస్తున్న విధానం, ఏయూకి జాతీయ స్థాయిలో ఉన్న గుర్తింపు, ర్యాంకింగ్ త‌దిత‌ర అంశాల‌ను వారికి తెలియ‌జేశారు. విదేశీ ఆచార్యుల‌ను ఏయూకు స్వాగ‌తిస్తామ‌ని ప్ర‌త్యేక‌మైన కోర్సుల‌ను బోధించ‌డం, ఏయూలో ఒక సెమిష్ట‌ర్ బోధించే విధంగా బిటిహెచ్ ఆచార్యుల‌ను పంపాల‌ని ప్ర‌తిపాద‌న చేశారు. దీనికి అవ‌స‌ర‌మైన ఫండింగ్ తాము అందించే విధంగా ప్రతిపాద‌న ఉంద‌న్నారు. 


బిటిహెచ్ డిప్యూటి వైస్ చాన్స‌ల‌ర్ వంజ లిండ్‌బ‌ర్గ్ మాట్లాడుతూ త‌మ విద్యార్థులు ప‌రిశ్ర‌మ‌ల‌తో అనుసంధానంగా, క‌ల‌సి ప‌నిచేస్తార‌న్నారు. ప‌రిశ్ర‌మ‌ల‌కు సంబంధించిన ప్రాజెక్టుల‌ను విద్యార్థులు నిర్వ‌హించే విధానం వివ‌రించారు. త‌మ వ‌ద్ద ఫ్యాక‌ల్టీ ఆఫ్ ఇంజ‌నీరింగ్‌, ఫ్యాక‌ల్టీ ఆఫ్ కంప్యూటింగ్ విభాగాల‌ను క‌లిగి ఉన్నామ‌న్నారు. వాటికి సంబంధించిన వివ‌రాలు, కోర్సులు త‌దిత‌ర అంశాల‌ను డీన్‌లు వివ‌రించారు.


 ఈ సంద‌ర్భంగా విశ్వ‌విద్యాల‌యం త‌ర‌పున బిటిహెచ్ ప్ర‌తినిధుల‌ను ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజశేఖ‌ర్‌ స‌త్క‌రించారు. కార్య‌క్ర‌మంలో రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు, ప్రిన్సిపాల్స్ ఆచార్య ఎం.వి.ఆర్ రాజు, ఆచార్య ఎం.శ‌శి, డీన్‌లు ఆచార్య వి.వల్లి కుమారి, జి.వి.ఆర్ శ్రీ‌నివాస రావు, పాల్ డ‌గ్ల‌స్‌,  వై.అబ్బులు, కూడా నాగేశ్వ‌ర రావు, శ్రీ‌దేవి, డాక్ట‌ర్ ఎన్‌.ఎం యుగంధ‌ర్‌ త‌దిత‌రులు పాల్గొన్నారు. 


అనంత‌రం ఏయూ సివిల్ ఇంజ‌నీరింగ్ విభాగం స‌మావేశ మందిరంలో నెక్ట్స్ జెన్ టెక్నాల‌జీస్ అంశంపై బిటిహెచ్ డీన్ ఆచార్య లార్స్ లంబ‌ర్గ్‌, టెక్నాల‌జీ, ఎంట‌ర్‌ప్యూన‌ర్‌షిప్‌, అండ్ ఎంట‌ర్‌ప్యూన‌ర‌ల్ ఎకో సిస్టంపై డీన్‌-ఫ్యాక‌ల్టీ ఆఫ్ ఇంజ‌నీరింగ్ ఆచార్య మార్టిన్ ఏండ‌ర్‌స‌న్ అంశంపై ప్ర‌సంగించారు.

Comments