. K.V.SHARMA EDITOR
ఆంధ్ర విశ్వవిద్యాలయం, జూలై 21:ఆంధ్ర విశ్వవిద్యాలయం కెరీర్ ప్లానింగ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్ (CPDC) మరియు ఏయూ-ఏపిఎస్.ఎస్.డి.సి సీమెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ సంయుక్తంగా నిర్వహించిన PMKVY 4.0 ఇంటర్న్‌షిప్, సమ్మర్ ఇంటర్న్‌షిప్ బ్యాచ్‌ల విద్యార్థులకు సర్టిఫికెట్ ప్రదానోత్సవం ఈ రోజు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్ర విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ జి.పి. రాజశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నైపుణ్యాభివృద్ధి నేటి పోటీ ప్రపంచంలో అత్యంత కీలకమని పేర్కొన్నారు. వీటిని కరికులంలో భాగం చేయాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులు తాము నేర్చుకున్న నైపుణ్యాలను కార్యరూపంలో చూపుతూ మరింత నిపుణత సాధించాలన్నారు. వర్చువల్ ల్యాబ్స్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలతో పాటు పరిశ్రమలకు అవసరమైన ప్రాయోగిక అనుభవాన్ని కూడా సంపాదించి ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎం.శశి మాట్లాడుతూ ఉపాధికల్పన, మెరుగైన ఉపాధి అవకాశాల మెరుగుపరచడంలో ఇటువంటి శిక్షణ కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. నిరంతరం ఇటువంటి శిక్షణ కార్యక్రమాలలో భాగం కావాలని సూచించారు. ఆన్‌లైన్‌లో నిర్వహించే శిక్షణ కార్యక్రమాలకు సైతం హాజరు కావాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో CPDC సంచాలకులు ఆచార్య వజీర్ మహ్మద్, ఆచార్య ప్రజ్ఞ తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా విజయవంతంగా ఇంటర్న్‌షిప్ పూర్తి చేసిన అభ్యర్థులకు సర్టిఫికెట్లు అందజేసి అభినందించారు.

Comments
Post a Comment