మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ఆశయాలు యువతకు శాశ్వత స్ఫూర్తి* – *ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్*
విశాఖ, జూలై 4:మన్యం వీరుడు, స్వాతంత్ర్య సమరయోధుడు శ్రీ అల్లూరి సీతారామరాజు 129వ జయంతి సందర్భంగా విశాఖపట్నం జిల్లా పాండ్రంగి గ్రామంలోని ఆయన జన్మస్థలంలో ఉన్న విగ్రహానికి ఘన నివాళులు అర్పించిన సందర్భంగా ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బ్రిటిష్ పాలకుల దమనకాండకు ఎదురొడ్డి ఆదివాసీల ఆత్మగౌరవం, స్వేచ్ఛ కోసం ప్రాణత్యాగం చేసిన మహానీయుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. దేశభక్తి, త్యాగనిరతి, ధైర్యసాహసాలకు అల్లూరి జీవితం చిరస్మరణీయమని, ఆయన ఆశయాలు నేటి యువతకు మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు.
విశాఖపట్నం జిల్లా పాండ్రంగి గ్రామంలోని అల్లూరి జన్మస్థలంలో జరిగిన నివాళుల కార్యక్రమంలో భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు, పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొని అల్లూరి సీతారామరాజు గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అల్లూరి సీతారామరాజు చూపిన దేశభక్తి, సేవా తత్వం, త్యాగస్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని దేశాభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని పీవీఎన్ మాధవ్ పిలుపునిచ్చారు


Comments
Post a Comment