K.V.SHARMA EDITOR
విశాఖపట్నం : విశాఖ సందేశం వార్తలు: టౌన్ కొత్త రోడ్ శ్రీ జగన్నాథస్వామి వారి రథోత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీ స్వామి వారు “మత్స్య” అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
శ్రీ సంపత్ వినాయగర్ దేవస్థానం తరపున దేవస్థానం వ్యవస్థాపక ఫ్యామిలీ సభ్యులు టి ఆర్ చోళన్ గారు , సహాయ కమిషనర్ మరియు కార్య నిర్వహణధికారి డి వి వి ప్రసాద్ , టి రాజేశ్వరన్ పట్టు వస్త్రాలు సమర్పించారు
. ఉదయం నుండి శ్రీ స్వామివారికి విశేష అర్చనలు, సహస్రనామార్చనలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఫెస్టివల్ ఆఫీసర్ టి అన్నపూర్ణ గారు, ఈఓ టి రాజగోపాల్ రెడ్డి, ధర్మ కర్తల మండలి చైర్మన్ సూరాడ రాజ్ కుమార్ మరియు సభ్యులు, అర్చకులు తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్నం అన్నసమారాధన, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు ఆహ్లాదకరంగా నిర్వహించారు.



Comments
Post a Comment