. D.S Varma Sr Sub EDITOR
ఈరోజు అనగా 06-07-2026 ఉదయం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బీజేపీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు శ్రీ MMN పరశు రామ రాజు గారి అధ్యక్షతన డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు.
స్వతంత్య్రనంతరం ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వంలో పరిశ్రమల శాఖామంత్రిగా ముఖర్జీ పని చేసారని, 1949 లో నెహ్రు పాకిస్తాన్ ప్రధానమంత్రి లియాఖత్ అలీఖాన్ తో జరిపిన ఢిల్లీ ఒప్పందం అనంతరం ఏప్రిల్ 6, 1950 న ముఖర్జీ వారి మంత్రి పదవికి రాజీనామా చేశారన్నారు. RSS వ్యవస్థాపకులు MS గోపాల్కర్ గారితో చర్చలు జరిపిన అనంతరం అక్టోబర్ 21, 1951 లో ఢిల్లీలో ముఖర్జీ భారతీయ జనసంఘ్ పార్టీ స్థాపించారని తెలిపారు. ఆ పార్టీ సంస్థాపక అధ్యక్షుడిగా ముఖర్జీ వ్యవహరించారన్నారు. ముఖర్జీ గోహత్య మరియు కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370 రాజ్యాంగ ప్రకరణకు తీవ్రంగా వ్యతిరేకించారన్నారు. దేశంలో 2 జాతీయ పతాకాలు, రెండు రాజ్యాంగాలు ఇద్దరు ప్రధాన మంత్రులు ఉండటాన్ని ముఖర్జీ తీవ్రంగా వ్యతిరేకించారని అన్నారు. కాశ్మీర్ లోకి అనుమతి లేకుండా అడుగుపెట్టి అరెస్టుకు గురై అనుమానాస్పద రీతిలో మరణించారని అన్నారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు పరశు రామ రాజు మాట్లాడుతూ జాతీయవాదిగా పేరుపొందిన శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారు 1901 జులై 6 న కలకత్తాలో జన్మించారని, ఆధునిక హిందుత్వ మరియు హిందూ జాతీయవాదాన్ని ప్రగాఢంగా విశ్వసించారని అన్నారు. ముఖర్జీ తొలుత భారత జాతీయ కాంగ్రెస్ తరుపున బెంగాల్ శాసనమండలికి ఎన్నికయ్యారన్నారు. గొప్ప జాతీయవాది, మానవతావాది అని తెలిపారు.
స్వతంత్య్రనంతరం ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వంలో పరిశ్రమల శాఖామంత్రిగా ముఖర్జీ పని చేసారని, 1949 లో నెహ్రు పాకిస్తాన్ ప్రధానమంత్రి లియాఖత్ అలీఖాన్ తో జరిపిన ఢిల్లీ ఒప్పందం అనంతరం ఏప్రిల్ 6, 1950 న ముఖర్జీ వారి మంత్రి పదవికి రాజీనామా చేశారన్నారు. RSS వ్యవస్థాపకులు MS గోపాల్కర్ గారితో చర్చలు జరిపిన అనంతరం అక్టోబర్ 21, 1951 లో ఢిల్లీలో ముఖర్జీ భారతీయ జనసంఘ్ పార్టీ స్థాపించారని తెలిపారు. ఆ పార్టీ సంస్థాపక అధ్యక్షుడిగా ముఖర్జీ వ్యవహరించారన్నారు. ముఖర్జీ గోహత్య మరియు కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370 రాజ్యాంగ ప్రకరణకు తీవ్రంగా వ్యతిరేకించారన్నారు. దేశంలో 2 జాతీయ పతాకాలు, రెండు రాజ్యాంగాలు ఇద్దరు ప్రధాన మంత్రులు ఉండటాన్ని ముఖర్జీ తీవ్రంగా వ్యతిరేకించారని అన్నారు. కాశ్మీర్ లోకి అనుమతి లేకుండా అడుగుపెట్టి అరెస్టుకు గురై అనుమానాస్పద రీతిలో మరణించారని అన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఉమ్మిడి సుజాత రాజ్, బీజేపీ రాష్ట్ర కోశాధికారి M నాగేంద్ర, బీజేపీ రాష్ట్ర మీడియా ప్యానెలిస్ట్ KNP చక్రవర్తి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీరంగం ధనేశ్వర రావు, దాడి పురుషోత్తం రమేష్, బీజేపీ సీనియర్ నాయకులు SVS ప్రకాష్ రెడ్డి, బొండాడ నరేంద్ర ప్రకాష్, T సుబ్బరామి రెడ్డి మరియు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొని నివాళులర్పించారు

Comments
Post a Comment