Skip to main content

కాంగ్రెస్ పార్టితోనే కాపులకు ముఖ్యమంత్రి పదవి సాధ్యం : మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్.. అయోధ్య రామమందిరం నిర్మాణ విరాళలలో కోట్లలో అవినీతి.....

 

               SRINIVAS SPL Correspondant 
అమలాపురం..విశాఖ సందేసం...కాపు  సామాజిక వర్గం నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్కరూ,ఒక్క రోజు కూడా ముఖ్యమంత్రి కాలేదని  కాంగ్రెస్ పార్టితోనే కాపులకు ముఖ్యమంత్రి పదవి సాధ్యమని  మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్ అన్నారు. చంద్రబాబు నాయుడు 19 సంవత్సరాలు,వైయస్ కుటుంబం 11 ఏళ్లు,ఈ రెండు కుటుంబాలు కలిపి మొత్తం 30 సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవి, రాయలసీమ ప్రాంతానికి చెందిన ఈ రెండు కుటుంబాలు పాలించాయని తెలిపారు. కాపులు టిడిపి లో ముఖ్యమంత్రి కాలేరు.జగన్ పార్టీలో ముఖ్యమంత్రి కాలేరు. ఒక్క కాంగ్రెస్ లోనే కాపు,బలిజ లు ముఖ్యమంత్రి కాగలరు.

ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యం లో కిర్లంపూడిలో కాపుల వీధిలో అంబేద్కర్ విగ్రహం పెట్టి,కాపు లు,దళితులు ఐక్యత కొరకు మేమిద్దరం కలిసి పనిచేశామని ఈ సందర్భంగా చింతామోహన్ గుర్తు చేశారు. ఉత్తర భారతదేశంలో ఓబీసీలు,దళితులు కలసి ముందుకెళ్ళారని,అదే విధంగా ఏపీలో కాపు,దళిత సామాజిక వర్గాలు ముందుకు పోవాల్సిన అవసరం ఉందన్నారు. భారత దేశంలో రాజకీయాలు అరాచకంగా, ఆందోళనకరంగా ఉందన్నారు. ప్రధాని మోడీ 12 ఏళ్ల పాలనలో ఏమి సాధించారని చింతామోహన్ ప్రశ్నించారు. నల్ల ధనం వెలికితీసి,ప్రతి ఇంటికీ రూ.15 లక్షల రూపాయలు ఇస్తామన్నారు.మాట తప్పారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని,ఇవ్వలేకపోయారని తెలిపారు.నేడు నిరుద్యోగులు నిరాశతో,నిస్పృహతో ఉన్నారని పేర్కొన్నారు.అయోధ్యలోvరామాలయం పేరు పెట్టి,ప్రతి ఇంటి నుంచీ,ప్రతి ఊరి నుంచి,ప్రతి కోటీశ్వరుడు నుంచి, ప్రపంచంలోని హిందువులు అందరి నుంచి వేలాది కోట్ల రూపాయలు తీసుకుని,స్వాహా చేశారు.దీనిపై టిటిడి పై విచారణ జరిపించినట్టుగా,అయోధ్య నిధులుపైన సుప్రీం కోర్టు నేతృత్వంలో సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బ్యాంకులు నుంచి కార్పొరేట్ల తీసుకున్న 16 లక్షల కోట్ల రూపాయలు రుణ మాఫీపై సిబిఐ విచారణ జరిపించాలి కోరారు. బిజెపి ప్రభుత్వ పాలనలో విదేశాంగ విధానం బ్రష్టు పట్టిందన్నారు.  20 వేల మంది చిన్నారులు చనిపోతే,ప్రపంచ దేశాలన్నీ ఖండించాయి,కానీ మన ప్రధాని మోడీ,విదేశాంగ శాఖ మౌనంగా ఉందన్నారు. 

కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో గ్యాస్ ధర రూ. 350 ఉందన్నారు. ఇప్పుడు రూ. 1000,  ఎరువులు, .మందుల ధరలు పెరిగాయి. బియ్యం,నూనె,కోడి గుడ్డు, కూరగాయలు ధరలు బాగా పెరిగాయన్నారు.  సామాన్య,మధ్యతరగతి కుటుంబాలు ఏమి కొనలేని,తినలేని పరిస్థితి ఏర్పడిందన్నారు.చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా గత 17 సంవత్సరాలుగా ఏపీకి, అమలాపురానికి, కోనసీమ జిల్లాకు ఏమి చేశారో చెప్పాలన్నారు.23 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చానని చెప్పడమే  కానీ అభివృద్ధి ఆంధ్రప్రదేశ్లో కనపడటం లేదని కరోనా కనిపిస్తోందన్నారు.  కరోనా నుంచి ప్రజలను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.  జగన్ పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు 16 ఏళ్లుగా విచారణ సాగుతోందని, జయలలితకు ఒక న్యాయం? జగన్ కో న్యాయమా? అని తమిళనాడులో చర్చ జరుగుతోందన్నారు. టిడిపి,వైసిపి ప్రాంతీయ పార్టీలపై ప్రజలకు విరక్తి కలిగిందన్నారు. 2029 ఎన్నికల్లో కేంద్రంలోనూ,ఏపీలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చింతామోహన్ ధీమా వ్యక్తం చేశారు

Comments