Skip to main content

కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అందరూ కృషి చేయాలి : ఎ.ఐ.సి.సి కార్యదర్శి డా. పాలక్ వర్మ అంబేద్కర్ కోనసీమజిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశం

.            SRINIVAS SPL Correspondant 
అమలాపురం,  విశాఖ సందేసం....డా.బి ఆర్.అంబెడ్కర్ కోనసీమజిల్లా కాంగ్రెస్  పార్టీ సమావేశానికి ముఖ్య అతిధిగా ఎ.ఐ.సి.సి కార్యదర్శి డా. పాలక్ వర్మ ముఖ్యఅతిధిగా పాల్గొని  కాంగ్రస్ పార్టీ బలోపేతం చేయడానికి దిశానిర్దేశం చేశారు.కాంగ్రెస్ పార్టీ జిల్లా కమిటీ మరియు మండల మిటీల నియామకాలను పర్యవేక్షించి త్వరలో మిగిలిన


నియామికాలను పూర్తి చేయాలని సూచించారు. ఓటర్ల జాబితా తయారీలో అవకతవకలు లేకుండా ఉండేందుకు కాగ్రెస్ కార్యకర్తలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. సి.డబ్ల్యూసి మెంబర్మాజీ ఎ.పిసి సి మాజి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముందడుగు వేసేందుకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త,నాయకులు కలసికట్టుగా అంకిత భావంతో పనిచేయాలని, రాహుల్ గాంధి  ప్రధాని అయితేనే మనదేశం పురోగతి సాధిస్తుందని వివరించారు. ఈ సమావేశంలో ముఖ్యఅతిధి ఎ.ఐ సి.సి కార్యదర్శి కార్యదర్శి ఉపన్యాసాన్ని ముషిణి రామకృష్ణారావు తెలుగులో తర్జుమాచేసారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కాంగ్రెస్ పార్టి రివ్యూ సమావేశంలో ఎ.ఐ సి.సి మెంబెర్ యార్ల గడ్డ రవీంద్ర ,సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎ.పి.సి.సి మాజి ఉపాధ్యక్షులు ముషిణి రామకృష్ణారావు,వివిధ మండలాల కాంగ్రెస్ పార్టి అధ్యక్షులు, పి గన్నవరం కోఆర్డినేటర్ ములపర్తి మోహనరావు, కొత్తపేట కోఆర్డినేటర్,రామచంద్ర పురం కోఆర్డినేటర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Comments