Skip to main content

శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానం, సింహాచలం. * గిరిప్రదక్షిణ ఏర్పాట్లు వేగవంతం చేయండి – అన్ని శాఖల సమన్వయంతో భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు ..............................ఈవో జల్లేపల్లి వెంకటరావు.

 


సింహాచలం :16 జూలై 2026 సింహాచలం శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారి వార్షిక గిరిప్రదక్షిణ (జూలై 28) మరియు గుడి ప్రదక్షిణ (జూలై 29) సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై దేవస్థానం కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకటరావు గురువారం సింహాచలం పరిపాలన భవనంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్‌డీసీ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఏఈఓలు, పర్యవేక్షణ అధికారులు,  సిబ్బందితో పాటు గోపాలపట్నం లా అండ్ ఆర్డర్ సీఐ సన్యాసినాయుడు, ట్రాఫిక్ సీఐ సురేష్ పాల్గొని గిరిప్రదక్షిణ నిర్వహణకు సంబంధించిన అంశాలపై విస్తృతంగా చర్చించారు.

సమావేశంలో ఉద్యోగుల డ్యూటీ పాయింట్ల కేటాయింపు, ఇతర ప్రభుత్వ శాఖలతో సమన్వయం, జూలై 28, 29 తేదీల్లో విధులకు హాజరయ్యే సిబ్బందికి వసతి కల్పించడం వంటి అంశాలపై కార్యాచరణను ఖరారు చేశారు. 

తొలి పావంచ వద్ద క్యూలైన్ నిర్వహణను ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులతో సమన్వయం చేసుకుంటూ జూలై 27 నాటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఈవో అధికారులను ఆదేశించారు.

భక్తుల సౌకర్యార్థం తాత్కాలిక మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాలను జివీఎంసీతో సమన్వయం చేసుకుని 27వ తేదీలోగా సిద్ధం చేయాలని సూచించారు. అలాగే తొలి పావంచ వద్ద అన్ని శాఖల సమన్వయంతో  ​కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి భక్తులకు అవసరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తూ పరిస్థితులను పర్యవేక్షించాలని ఆదేశించారు.

పార్కింగ్ ప్రదేశాల్లో స్పష్టమైన సూచిక బోర్డులు ఏర్పాటు చేసి, వాహనాల పార్కింగ్ నిర్వహణను సమర్థవంతంగా అమలు చేయాలని తెలిపారు. కొండపై తాత్కాలిక మరుగుదొడ్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, తాత్కాలిక లైటింగ్ ఏర్పాట్లు జూలై 27 నాటికి పూర్తిచేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.

కొండపై మరియు కొండ దిగువ ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ఆడియో వ్యవస్థలు నిరంతరం పనిచేసేలా సిద్ధం చేయాలని ఈవో స్పష్టం చేశారు.

పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ, కొండ దిగువ ప్రాంతాల్లో జివీఎంసీ సహకారంతో విస్తృతంగా శానిటేషన్ పనులు చేపట్టాలని, కొండపై ఇప్పటికే ఉన్న సిబ్బందితో పాటు అదనపు పారిశుద్ధ్య సిబ్బందిని నియమించి భక్తులకు పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించాలని శానిటేషన్ విభాగాన్ని ఆదేశించారు.

ఈ సమావేశంలో ఎస్‌డీసీ మధులత, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సింగం రాధా, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాంబాబు, డీఈ (ఇన్‌చార్జి) రామరాజు, ఏఈఓలు వాడ్రేవు రమణమూర్తి, పిల్లా శ్రీనివాస్, గాడి అప్పలనాయుడు, పర్యవేక్షణ అధికారులు, గోపాలపట్నం లా అండ్ ఆర్డర్ సిఐ సన్యాసినాయుడు ట్రాఫిక్ సిఐ సురేష్ మరియు దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు.

Comments