K.V.SHARMA EDITOR
విశాఖపట్నం ,జూలై 5: జీవీఎంసీ ఈస్ట్ జోన్ లో రామ్ నగర్ సమీపంలో పేకర్ లేఔట్ పార్కు అభివృద్ధికి ప్రణాళికలను, అంచనాలను సిద్ధం చేసి నివేదికను సమర్పించాలని జీవీఎంసీ ఇంజనీరింగ్ అధికారులను జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశించారు. ఆదివారం ఆయన జీవీఎంసీ అదనపు కమిషనర్ పీఎం సత్యవేణి, కార్యనిర్వాహక ఇంజనీర్ గంగాధర్ లతో కలసి పేకర్ లేఅవుట్ లో ఉన్న పార్కు స్థలాన్ని పరిశీలించారు.
ముందుగా పేకర్ లేఔట్ పార్కు స్థలాన్ని పరిశీలించి పార్కును అభివృద్ధి చేసేందుకు తగిన ప్రణాళికల వివరాలను ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పేకర్ లేఔట్ రెసిడెంట్స్ అసోసియేషన్ (FLORA )ప్రతినిధులు కమిషనర్ ను కలిసి పేకర్ లేఔట్ లో 650 కి పైగా నివాసితులు నివసిస్తున్నారని, ప్రజల వ్యాయామానికి, ఆహ్లాదానికి, వాకింగ్ కు, చిన్నపిల్లల ఆటలకు ఈ సమీపంలో సరైన పార్కు లేనందున ఉన్న పార్కు స్థలాన్ని అభివృద్ధి చేయాలని ,అందుకు జీవీఎంసీ ప్రతిపాదించిన నిధులలో 1/3 (ఒకటి బై మూడు) వంతు నిధులను అందించేందుకు అసోసియేషన్ భాగస్వామ్య అంగీకారం తెలుపుతున్నామని , అన్ని మౌలిక సదుపాయాలతో పార్కును అభివృద్ధి పరచి ప్రజలకు సౌకర్యాన్ని కల్పించాలని కమిషనర్ ను కోరారు.
అనంతరం పార్కు స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన కమిషనర్ వారితో మాట్లాడుతూ పార్కు అభివృద్ధిలో 1/3 వ వంతు నిధులు భాగస్వామ్యం అందిస్తామని అసోసియేషన్ తరపున వ్రాతపూర్వకంగా జీవీఎంసీ కి లేఖను సమర్పించాలని కమిషనర్ వారికి సూచించారు. పార్కు అభివృద్ధికి కావలసిన వాకింగ్ ట్రాక్ , పచ్చదనం, ఆట , వ్యాయామ పరికరాలు తదితర మౌలిక సదుపాయాల ఏర్పాటుకు, అభివృద్ధికి ప్రణాళికలను సిద్ధం చేసి, వ్యయ అంచనాలను నివేదిక రూపంలో సమర్పించాలని కార్యనిర్వాహక ఇంజనీరు గంగాధరకు కమిషనర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో పేకర్ లేఔట్ రెసిడెంట్స్ అసోసియేషన్ (FLORA ) కార్యదర్శి సుధాకర్ రాజు, ప్రతినిధులు సతీష్ , జీవీఎంసీ ఇతర అధికారులు పాల్గొన్నారు.
పౌర సంబంధాల అధికారి జివిఎంసి


Comments
Post a Comment