ఓకే ఒక్కడు
అందరి హిందూ
బంధువు.
భరత జాతి
ఖ్యాతిని నలు
దిశలా చాట గల
నిలబెట్ట గల దిట్ట,
కార్యోన్ముఖుడు.
ఎవరికి తల
వంచడు,
ఎవరి తోను
ఉత్తినే తల
పడడు, ఎవరికీ
లొంగడు, ఒంగడు.
హిందూత్వమే
తన అభిమతం.
అలా అని
ఇతర మతాలను,
మతస్థులను
చులకన చేయడు.
ఎవరేమనుకున్న
తన సంస్కృతి,
సంప్రదాయం,
భారతావని
విలువలను,
గౌరవాన్ని
నిలబెట్టడం
తన విధి,
బాధ్యత అని
పరితపించే
వ్యక్తిత్వం.
సర్దుకు పోయే
మనస్తత్వం
అసలు కాదు.
సర్ది చెప్పే
గుణం వారిది.
గత పుష్కర
కాలంగా అందరి
మన్ననలను
చూరగోంటూ
దేశంలో విప్లవ్వాత్మక
మార్పులు
తీసుకు వస్తూ
ఆర్ధిక సుస్థిరతకు
పెద్ద పీట వేస్తూ
ప్రపంచ అగ్ర
దేశాలను సైతం
భారత దేశం
వైపు చూసే
సుపరి పాలనకు
శ్రీకారం చుట్టి
దేశ ప్రధాని గా
పాలనకే
నిర్వచనం
చెప్పిన యోగి
పుంగవుడు
మన 'నమో'.
నమో కి నేడు
సాటి లేరు,
రారు, రాలేరు
మరెవ్వరు.
తన భద్రత కన్నా
దేశ భద్రతే మిన్న
అని నమ్మే మన
నమో. నిరంతరాన్వెషి,
నియమ బద్ధ
పాలన కేవలం
నమో కే చెల్లు.
పాలన లో తన
భక్తిని చాటుతూ
రక్తి కట్టించగల
సమర్ధుడు.
తనను విమర్శించే
అవకాశం ఇటు
పార్టీ లోను, అటు
ప్రతి పక్షాలకు
తావివ్వని
పాలనా దక్షుడు,
దేశ రక్షకుడు
మన 'నమో'.
కేంద్ర, తన
రాష్ట్రాల
పాలనలో
అవినీతి అన్నది
కాన రాదు,
తావివ్వడు.
అవినీతికి
పాల్పడ్డ వారు
ఎవరైనా
ఉపేక్షించడు
నమో.
దూషనలకు
దూరం.
ఎవరినీ
దూషించే
స్వభావం
కాదు, వారిది.
అందుకే
నమోని
నమ్ముదాం,
వారి నమ్మకమైన
సుస్థిర పాలనను
అభినందిద్దాం,
భారతీయ
ఐక్యతను
చాటుదాం.
Dr. నండూరి రామకృష్ణ
Sr Sub EDITOR
12.07.2026

Comments
Post a Comment