.
SRINIVAS SPL Correspondantఅల్లవరం, విశాఖ సందేసం...తల్లికి వందనం' పథకం అమలు పేరుతో రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖలు, సంస్థల నిధులను మళ్లించడం అత్యంత బాధ్యతారాహిత్యమైన చర్యని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు బొమ్మి ఇజ్రాయిల్ తీవ్రంగా విమర్శించారు. దేవదాయ శాఖ నుంచి రూ.26.03 కోట్లను విడుదల చేస్తూ పరిపాలన అనుమతులు ఇవ్వడం, బ్రాహ్మణ కార్పొరేషన్ పరిధిలోని 'తల్లికి వందనం' లబ్ధిదారులకు చెల్లింపుల కోసం ఈ నిధులను వినియోగించనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి అద్దం పడుతోందన్నారు. ప్రభుత్వం తన సాధారణ ఆదాయ వనరులతో సంక్షేమ పథకాలను అమలు చేయాల్సింది పోయి, వివిధ శాఖల నిధులను మళ్లిస్తూ పథకాలను కొనసాగించడం ఆర్థిక క్రమశిక్షణకు విరుద్ధమని పేర్కొన్నారు. ఒక శాఖ అవసరాల కోసం కేటాయించిన నిధులను మరో పథకానికి వినియోగించడం వల్ల సంబంధిత శాఖల అభివృద్ధి కార్యక్రమాలు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఏడాది కూడా కొందరికే ‘తల్లికి వందనం’ పథకం అమలు చేస్తున్నారని,ఈ ఏడాది 22.65 లక్షల మందికి ఎగనామం పెట్టబోతుందని,
యూడైస్ గణాంకాలను బట్టి 87.41 లక్షల మంది విద్యార్థులు ఉంటే కేవలం
64.76 లక్షల మందికి మాత్రమే తల్లికి వందనం పథకం అమలు చేస్తుందని,
తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టిన చంద్రబాబు ప్రభుత్వం,రెండో ఏడాది 21 లక్షల మంది తల్లులకు మొండిచేయి చూపుతుందని,ఈ పథకానికి ఏడాదికి రూ.13,112.82 కోట్లు కేటాయించాల్సి ఉండగా ఈ ఏడాది రూ.10,120.78 కోట్లకే అనుమతి ఇచ్చిందని,గత ఏడాది అరకొరగా రూ. 6,377 కోట్ల ఖర్చుపెట్టి చేతులు దులుపుకుందని, ఈ ఏడాది కూడా అదే పరిస్థితి అని,మూడేళ్లలో తల్లులకు బాబు బకాయి రూ.22,840.68 కోట్లు ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు పారదర్శకమైన ఆర్థిక నిర్వహణ చేపట్టాలని, ఇతర శాఖల నిధులను మళ్లించే విధానాన్ని తక్షణమే విరమించుకోవాలని బొమ్మి ఇజ్రాయిల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి, ప్రతి శాఖకు కేటాయించిన నిధులను ఆయా శాఖల అభివృద్ధికే వినియోగించాలని డిమాండ్ చేశారు.

Comments
Post a Comment