Skip to main content

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మెడికవర్ సేవలు.... మెడికవర్ ఆధ్వర్యంలో బ్రెయిన్ డే....

.          SRINIVAS SPL Correspondant 
 అమలాపురం, విశాఖ సందేసం...బ్రెయిన్ డే సందర్బంగా స్థానిక అమలాపురం ప్రెస్ క్లబ్ లో మెడికవర్ ఆసుపత్రి బృందం మీడియా సమావేశం నిర్వహించారు. ఆగష్టు నెల చివరి వరకు  బ్రెయిన్ సంబందించి స్కానింగ్లపై 30శాతం రాయితీ ఉంటుందని, దానికి సంబందించిన బ్రౌచర్ ను ప్రారంభించారు. మీడియా సమావేశంలో ప్రముఖ న్యూరో సర్జన్ లింగోలు చందు మాట్లాడుతూ మనిషి అవయవాలలో  గుండె ఎంత ప్రాముఖ్యమో దానికన్నా మరి ముఖ్యమైనది బ్రెయిన్ (మెదడు) అని, మెదడులో ఏవిధమైన మార్పులు వచ్చిన శరీరం మొత్తం ఇబ్బంది పడే పరిస్థితులలో బ్రెయిన్ పనిచేస్తుందని,


 అందువలన బ్రెయిన్ కు ఇబ్బంది కలిగకుండా ప్రతి ఒక్కరూ చూసుకోవాలన్నారు. వాహన ప్రయాణాలలో  మెదడుకు  ఎటువంటి ప్రమాదం జరగకుండా ప్రజలు హెల్మెట్ ధరించాల్ని, కారు ప్రయాణలలో సిట్ బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితులలో బ్రెయిన్ పై ఎక్కువ ఒత్తిడి పెరిగిన కేసులు నమోదు అవుతున్నాయని అన్నారు. కాకినాడ నుండి కోనసీమకు రావడానికి ముఖ్య ఉద్దేశ్యం చిన్న  వయస్సు నుండి బ్రెయిన్ పై వచ్చే రోగాలను ముందుగానే గమనించి మమల్ని సంప్రదించాలని, సమస్య తీవ్ర స్థాయికి వెళ్లకుండా  మెడికవర్ బృందం అందుబాటులో ఉంటుందని కోనసీమ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైద్యులు భాస్కర్, మేనేజర్   అంజిబాబు, పి ఆర్ ఒ సుకుమార్ పాల్గొన్నారు

Comments