Skip to main content

మాజీ ముఖ్య మంత్రి , పార్టీ అధ్యక్షులు శ్రీ *వై.యస్. జగన్ మోహన్ రెడ్డి* గారి ఆదేశాల మేరకు ..


జిల్లా మహిళా అధ్యక్షురాలు శ్రీమతి పేడాడ రమణి కుమారి ఆధ్వర్యంలో విశాఖపట్నం ఎల్.ఐ.సి బిల్డింగ్ జంక్షన్ లో గల డా. బిఆర్‌ అంబేద్కర్‌ గారి విగ్రహం వద్ద తెలుగుదేశ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మహిళలపై దాడులు, అఘాయిత్యాలు, హత్యలు, హత్యాచారాలు చరిత్రలో ఎప్పుడూలేని విధంగా మహిళలను వివస్త్రలను చేసే గుంటూరు, బద్వేలు లాంటి సంఘటనలు సంభవిస్తున్నాయి. *ప్రభుత్వ చేతగానితనం, నిర్లక్ష్య వైఖరి* వలన తెలుగుదేశ నాయకులు ఇలాంటి ఘటనలు చేస్తున్నారు అని *నిరసన కార్యక్రమం జరిగింది

పార్లమెంట్ సమన్వయ కర్త బొత్స ఝాన్సీ గారు మాట్లుడుతూ ... 

రాష్ట్రంలో సామాన్య ప్రజలు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు మరియు మహిళల పరిస్థితి రోజురోజుకూ ఆందోళనకరంగా మారుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఆవేదన వ్యక్తం చేసింది. పార్టీ అధ్యక్షులు శ్రీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, విశాఖపట్నంలో నిర్వహించిన కార్యక్రమంలో మహిళల భద్రత, న్యాయం, హక్కుల పరిరక్షణపై తమ డిమాండ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చామని తెలిపారు. ప్రభుత్వం ఒకవైపు హిందూ సాంప్రదాయాలు, సంస్కృతి గురించి గొప్పలు చెబుతుండగా, మరోవైపు మహిళలకు సరైన రక్షణ కల్పించడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. మహిళలు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినా, కనీసం కేసు నమోదు చేయని పరిస్థితులు నెలకొనడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. గుంటూరు జిల్లాలో జరిగిన ఘటన వంటి సంఘటనలు రాష్ట్రంలో మహిళల భద్రతపై తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. ఇలాంటి సంఘటనలపై ప్రభుత్వం వెంటనే స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాము రెండుసార్లు ఎంపీగా ప్రజలకు సేవ చేసే అవకాశం పొందినప్పటికీ, ఇలాంటి దుర్ఘటనలు, మహిళలకు న్యాయం అందని పరిస్థితులు ఇంత తీవ్రంగా ఎప్పుడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు భద్రత, బాధితులకు తక్షణ న్యాయం, పోలీస్ వ్యవస్థలో బాధ్యతాయుతమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఈ సందర్భంగా కోరింది.

జిల్లా పార్టీ అధ్యక్షులు కెకె రాజు గారు మాట్లుడుతూ ... 

రాష్ట్రంలో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారింది – బాధితులకు న్యాయం ఎక్కడ?

రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులు, వేధింపులు రోజురోజుకూ పెరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మహిళలకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం ఆ బాధ్యతను నిర్వర్తించడంలో విఫలమైందనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. అధికార పార్టీకి చెందిన నాయకులు అధికారాన్ని, పోలీసు వ్యవస్థను అండగా చేసుకుని చట్టాన్ని తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అధికార పార్టీతో సంబంధం ఉంటే ఎలాంటి నేరం చేసినా చర్యలు ఉండవన్న భావన పెరిగే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్లలో కూడా అధికార పార్టీ నాయకుల ప్రభావం అధికమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. బాధితులు ఫిర్యాదు చేయాలంటే స్థానిక అధికార పార్టీ నాయకుల అనుమతి అవసరమా అనే సందేహాలు తలెత్తే పరిస్థితి నెలకొంది. ఫిర్యాదులు స్వీకరించడంలో జాప్యం, చర్యల్లో నిర్లక్ష్యం, కొన్ని సందర్భాల్లో బాధితులపైనే ఎదురు కేసులు నమోదు చేయడం వంటి పరిణామాలు ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయి. భారత పార్లమెంట్ రూపొందించిన చట్టాల కంటే రాజకీయ ప్రభావమే ఎక్కువగా పనిచేస్తోందనే అభిప్రాయం ప్రజల్లో బలపడుతోంది. భారతీయ న్యాయ సంహిత , భారతీయ నాగరిక సురక్షా సంహిత  నిబంధనల కంటే రాజకీయ ఆదేశాలకే ప్రాధాన్యం ఇస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల వల్ల ప్రధానంగా మహిళలు, చిన్నారులు, దళితులు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజలే ఎక్కువగా నష్టపోతున్నారు. ప్రతిపక్షాలకు చెందిన వ్యక్తులు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడితే వేగంగా కేసులు నమోదు చేసి అరెస్టులు జరుగుతుండగా, మహిళలపై అధికార పార్టీ నేతలపై ఆరోపణలు వచ్చిన సందర్భాల్లో మాత్రం వీడియోలు వైరల్ అయ్యేవరకు పోలీసులు స్పందించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.రాజకీయ కక్ష సాధింపుల కోసం పోలీసు వ్యవస్థను వినియోగిస్తున్నారని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో, మహిళల భద్రత మరియు బాధితులకు సత్వర న్యాయం కల్పించడంపై ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. చట్టం ముందు అందరూ సమానులనే సూత్రాన్ని ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ ఆచరణలో నిరూపించాలి. మహిళల భద్రతను రాజకీయాలకు అతీతంగా పరిగణించి, నిందితులు ఎవరైనా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో ప్రజలకు చట్టపరమైన రక్షణ, న్యాయం అందేలా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని కోరుతున్నాము.

ఈ కార్యక్రమమం లో సమన్వయకర్త మొల్లి అప్పారావు, మాజీ నగర మేయర్ గోలగని హరి వెంకట్ కుమారి , మాజీ జిసిసి చైర్మన్ శోభ స్వాతి రాణి,  పార్టీ నాయుకులు శ్రీ దేవి వర్మ , ఉమ్మడి స్వాతి , సాది పద్మా రెడ్డి, బెందాళం పద్మావతి, , బయ్యవరపు రాధ, మల్లా ధనలత, మహమ్మద్ సాబీర్ బేగం, రీసు అనురాధ, కోనాల విజయ వినీత, కారెక్కట్ శిరీష, పప్పుల సునీత, పల్ల చిన్న తల్లి, పలివెల ఈశ్వరి, గీతారెడ్డి, సలాది భవాని , చుక్క వర  లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Comments