. K.V.SHARMA EDITOR
ఆంధ్రవిశ్వవిద్యాలయం:జూలై22:ఆంధ్రవిశ్వవిద్యాలయాన్ని యూనివర్సిటీ అఫ్ నార్త్ కరోలినా విల్మింగ్టన్ (UNCW) ఛాన్సలర్ డాక్టర్ అశ్వని కె. వోలేటి సందర్శించి ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజశేఖర్ తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వీసీ ఆచార్య జి.పి రాజశేఖర్ ఏయూ పూర్వవిద్యార్థులను అనుసంధానించే విధంగా చేపడుతున్న కార్యక్రమాలు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డీన్ కార్యాయలం, ఏయూ-సేతు కార్యక్రమం వంటివి వివరించారు. పూర్వ విద్యార్థులను గుర్తించి మూడు విభాగాలుగా పురస్కారాలను సైతం ఇటీవల అందించామన్నారు. ఆస్ట్రేలియా పూర్వ విద్యార్థులతో ఇటీవల సమావేశం నిర్వహించామని, అమెరికాలో శతాబ్ధి వేడుకలను త్వరలో నిర్వహిస్తామన్నారు. ఏయూకు బలమైన స్టార్టప్-ఇంక్యేబేషన్ వ్యవస్థ ఉందన్నారు. పేటెంట్‌లను పెంపొందించడంపై ప్రత్యేఖ శ్రద్ద చూపుతున్నామన్నారు. ఏయూ వివిధ ప్రభుత్వ సంస్థలు, పరిశోధన కేంద్రాలు, పరిశ్రమలతో కలసి పనిచేస్తున్న విధానం, నిర్వహిస్తున్న పరిశోధన ప్రాజెక్టుల వివరాలు తెలియజేశారు. రెండు విశ్వవిద్యాలయాలు కలసి పనిచేయడానికి అనువైన అంశాలపై చర్చించారు.
డాక్టర్ అశ్వని కే. వోలేటి మాట్లాడుతూ హెల్త్‌కేర్, హెల్త్ సైన్సెస్ రంగంలో తమ విశ్వవిద్యాలయం చేపడుతున్న కోర్సులను తెలియజేశారు. కెరియర్‌లో ప్రగతి, మార్పు కోరుకునే వారికి అందించే మైక్రో కోర్సులపై చర్చించారు. తమ క్యాంపస్, విద్యార్థులు, ఆచార్యులు, బోధన, పరిశోధన వసతులు వంటి అంశాలను తెలియజేశారు. ఆంధ్రవిశ్వవిద్యాలయంతో కలసి పనిచేయడానికి అనువైన వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం ఎం.ఎల్.ఆర్ విభాగాన్ని, ప్రయోగశాలలను సందర్శించి, ఆచార్యులతో చర్చించారు. కార్యక్రమంలో యూనివర్సిటీ అఫ్ నార్త్ కరోలినా విల్మింగ్టన్ (UNCW) గ్రాడ్యుయేట్ స్కూల్ డీన్ క్రిస్టోఫర్ ఫీనెల్లి, రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏయూ తరపున అశ్విని కుమార్‌ను సత్కరించి, జ్ఞాపిక బహూకరించారు.

Comments
Post a Comment