వరాహా అవతారంలో ఉన్న జగన్నాథునికి పట్టు వస్త్రాలు సమర్పించిన శ్రీ వైభవ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం !
K.V.SHARMA EDITOR
విశాఖపట్నం : టర్నర్ సత్రం వద్ద జరుగుతున్న శ్రీ జగన్నాథస్వామి వారి రథోత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీ స్వామి వారు భూదేవిని కాపాడిన “వరాహా” అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.ఉదయం నుండి శ్రీ స్వామివారికి విశేష అర్చనలు, సహస్రనామార్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు
. శ్రీ వైభవ వేంకటేశ్వర దేవస్థానం తరపున ఈఓ బండారు ప్రసాద్ గారు, అర్చకులు, సేవా సంఘం వారు జగన్నాథ స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. వారిని ఈఓ టి రాజ గోపాల్ రెడ్డి, చైర్మన్ ఎస్ రాజ్ కుమార్, మరియు సభ్యులు, అర్చకులు స్వాగతం పలికి
, స్వామి వారి దర్శనం చేయించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. మధ్యాహ్నం 1000 మంది భక్తులకు అన్నసమారాధన, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు ఆహ్లాదకరంగా నిర్వహించారు



Comments
Post a Comment