వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానం, సింహాచలం సింహగిరిపై పునర్వసు హోమం వైభవం - శ్రీరాముని జన్మనక్షత్ర పూజ.
సింహాచలం 14 జూలై 2026.సింహగిరి క్షేత్రం ఆధ్యాత్మిక కాంతులతో వెలుగో0దుతుంది. శ్రీ శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానం పరిధిలో, గంగధార సమీపంలో కొలువై ఉన్న పురాతన ఉప ఆలయం
శ్రీ రామాలయంలో, లోకారాధ్యుడు శ్రీరామచంద్రప్రభువు జన్మనక్షత్రమైన పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకొని నేడు పునర్వసు హోమ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది.
వేదఘోషలు, మంత్రనాదాలు, నాదస్వర వాద్యాల దివ్యనాదాల మధ్య ఈ పవిత్ర హోమం భక్తిశ్రద్ధలతో, కనులపండువగా నిర్వహించబడింది.



Comments
Post a Comment