రాజు ఒక నియోజకవర్గం 68 వ వార్డు మింది గ్రామంలో వైఎస్సార్‌సీపీ కార్యదర్శి గుడివాడ లతీష్ జన్మదిన వేడుకలు ఆయన స్వగ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు లతీష్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. శ్రీనివాస్ గుడివాడ లతీష్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. లతీష్ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని శ్రీనివాస్ ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో 68 వ వార్డు మాజీ కార్పొరేటర్ గుడివాడ అనూష,యువజన నాయకుడు రెడ్డిపల్లి అవినాష్, 68వ వార్డ్ మైనార్టీ సెల్ అధ్యక్షులు హుస్సేన్, 68వ వైస్సార్సీపీ వార్డ్ నాయకులు ఒరుపుల శ్రీనివాసరావు, హంసరవల్లి, శారద ఈటి చిన్నా ఆది బాబు,పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని గుడివాడ లతీష్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Comments
Post a Comment