Skip to main content

భారత మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారి "వెంకయ్య నాయకుడు" పుస్తక పరిచయ కార్యక్రమంలో జనసేన పార్టీ విశాఖ నగర అధ్యక్షులు,సౌత్ ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొన్నారు*


 భారత దేశ మాజీ ఉపరాష్ట్రపతి, అందరి ఆత్మీయులు శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు  విశిష్ట రాజకీయ, ప్రజాసేవా జీవితాన్ని ఆవిష్కరిస్తూ సీనియర్ పాత్రికేయులు శ్రీ ఎం.ఏ. శర్మ  రచించిన "వెంకయ్య నాయకుడు" పుస్తక పరిచయ కార్యక్రమంలో జనసేన విశాఖ నగర అధ్యక్షులు, దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ రాజకీయ ప్రముఖులతో కలిసి పాల్గొన్నారు.


ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు శ్రీ వెంకయ్య నాయుడు  సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం, ప్రజాసేవ పట్ల ఆయనకున్న అంకితభావం, పార్లమెంటరీ సంప్రదాయాల పరిరక్షణలో ఆయన పోషించిన కీలక పాత్ర, యువతకు ఆయన జీవితం స్ఫూర్తిదాయకమని కొనియాడారు.


ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్  కూడా శ్రీ వెంకయ్య నాయుడు  సేవలను ప్రశంసిస్తూ, ఆయన జీవన ప్రస్థానం భావితరాలకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. "వెంకయ్య నాయకుడు" పుస్తకం ఆయన వ్యక్తిత్వం, నాయకత్వ లక్షణాలు, ప్రజాసేవా దృక్పథాన్ని నేటి తరానికి చేరవేసే విలువైన గ్రంథమని అభిప్రాయపడ్డారు.

Comments