. K.V.SHARMA EDITOR
విశాఖపట్నం :విశాఖ సందేశం వర్తవాహినీ: టర్నర్ సత్రం ప్రాంగణంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ జగన్నాథ స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రథ యాత్ర మహోత్సవాలు 5వ రోజు సందర్భంగా సోమవారం నాడు శ్రీ జగన్నాథ స్వామివారు "నృసింహ" అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
స్వామి వారికి సింహాచలం దేవస్థానం తరపున ఈఓ జే వెంకట రావు గారి దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శ్రీమతి టి అన్నపూర్ణ గారు, ఆలయ
ఈఓ టి. రాజ గోపాల్ రెడ్డి, ధర్మ కర్తల మండలి చైర్మన్ ఎస్ రాజ్ కుమార్ మరియు సభ్యులు మర్యాద పూర్వకంగా వారికి స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేయించి తీర్థ ప్రసాదాలను అందజేశారు.అనంతరం మధ్యాహ్నం 1000 మంది భక్తులకు అన్న సంతర్పణ చేయడం జరిగింది. సాయంత్రం వేళ స్వామి వారి సన్నిధిలో న్యాయవాదులచే భక్తి సంగీత విభావరి, చిన్న పిల్లలచే కూచిపూడి నృత్య ప్రదర్శన అందరిని అలరించింది. స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు.

Comments
Post a Comment