పార్కుల్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా పచ్చదనం పెంపొందించాలి మియావాకి పార్కులను అభివృద్ధి చేసేలా ప్రణాళిక సిద్దం చేయాలి
. K.V.SHARMA EDITOR
విశాఖపట్నం:విశాఖ సందేశం వార్తలు: నగర వాసులు పచ్చదనం ఉండే పార్కుల్లో ఎక్కువ సమయాన్ని గడిపేందుకు ఆసక్తి చూపుతున్నారని, అందువల్ల వీఎంఆర్డీఏ పరిధిలోని అన్ని పార్కుల్లో వాకర్స్, సందర్శకులకు ఆహ్లాదాన్ని అందించేలా పచ్చదనం పెంపొందించాలని వీఎంఆర్డీఏ ఛైర్మన్ ఎం వి ప్రణవ్ గోపాల్ ఆదేశించారు. శనివారం ఉదయం వీఎంఆర్డీఏ కార్యాలయంలో అటవీశాఖ విభాగ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర పరిధిలో 50 పార్కులను అభివృద్ది చేసి, పచ్చదనం పెంపొందించేలా ప్రణాళిక సిద్దం చేయాలని ఆదేశించారు. ఎంవీపీకాలనీలో ఉన్న వీఎంఆర్డీఏ నర్సరీని ప్రైవేటు నర్సరీలతో పోటీ పడేలా అభివృద్ధి చేయాలని, నర్సరీ గురించి విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు. నగర పరిధిలో తక్కువ స్థలంలో ఎక్కువ పచ్చదనం పెంపొందించి , అటవీ ప్రాంతంగా తీర్చిదిద్దే మీయావాకీ పార్కులను సంఖ్యను పెంచేలా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ప్రధానంగా వీఎంఆర్డీఏకి చెందిన లేఅవుట్లలో పచ్చదనం పెంపొందించే ఏర్పాట్లు చేయాలన్నారు. బోగాపురం విమానాశ్రయానికి చేరుకునేందుకు వీఎంఆర్డీఏ అభివృద్ధి చేసిన ప్రధాన రహాదారుల విభాగిని మద్యలో పచ్చదనం పెంపొందించేలా ఏపుగా పెరిగే చెట్లను పెంచాలని, ఆకర్షణీయంగా కనిపించేలే చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో కార్యదర్శి మురళీకృష్ణ, డీఎఫ్ఓ ఎ.వి.రమణమూర్తి, ఎఫ్ ఆర్ ఓ శిరీష, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Comments
Post a Comment