ఘనంగా ప్రధానోపాధ్యాయులు రామకృష్ణ మాస్టారు పదవీవిరమణ సన్మానసభ.... హై స్కూల్ ప్రాంగణంలో పోటెత్తిన అభిమానం... రామకృష్ణ మాస్టారు సేవలను కొనియాడిన ప్రముఖులు....
SRINIVAS SPL Correspondant
అమలాపురం..విశాఖ సందేసం....37 సంవత్సరాలుగా సుదీర్ఘకాలం ఉపాధ్యాయ వృత్తిలో ఎందరో విద్యార్థులకు జీవిత గమ్యాన్ని నిర్దేశించి విశేష సేవలందించి ఉద్యోగ విరమణ సందర్భంగా ఆదివారం అమలాపురం జిల్లా ప్రజా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో భమిడిపాటి వెంకట సాయి రామకృష్ణ మాస్టారును విద్యార్థులు పూర్వ విద్యార్థులు ఆయన దగ్గర చదువుకున్న వివిధ స్థాయి ఉద్యోగుల్లో పని చేస్తున్న ఉద్యోగులు ఘనంగా సత్కరించి వారిపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.
వివిధ హోదాల్లో ఉన్న మాస్టర్లు ఆయన దగ్గర చదువుకుని ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో పని చేస్తున్న ఉద్యోగులు ఇప్పటి పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని,విద్యార్థులు, తోటి ఉపాధ్యాయులు ఎంఈఓలు బంధువులు స్నేహితులు తదితర శాఖలో పనిచేస్తున్న స్నేహితులు, శ్రేయోభిలాషులు మాస్టారు దంపతులకు పూలమాలలు వేసి దూస్సాలువాలు కప్పి విశేషమైన ప్రత్యేక బహుమతులను అందజేసి ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో రామకృష్ణ మాస్టర్ మాట్లాడుతూ నన్నింతగా అభిమానించి ఘనంగా సత్కరించిన ప్రతి ఒక్కరికి బంధువులకు, స్నేహితులకు ముఖ్యంగా విద్యార్థిని,విద్యార్థులకు అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రత్యేక వ్యాఖ్యాతగా నిలిచిన అవధాని గణితం మాస్టారును రామకృష్ణ దంపతులు శాలువ కప్పి పూలమాలతో సత్కరించి అభినందించారు.



Comments
Post a Comment