శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానం, సింహాచలం. పౌర్ణమి సందర్భంగా భక్తులకు నిత్య అన్నప్రసాదం వడ్డించిన ఈవో దంపతులు. భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి – పాలు, మజ్జిగ, బిస్కెట్ల పంపిణీ.
K.V.SHARMA EDITOR
సింహాచలం, 29 జూలై 2026:పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకోవడానికి విచ్చేసిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా సింహాచలం దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
అనంతరం శ్రీ స్వామివారి నిత్య అన్నప్రసాద వితరణ కేంద్రంలో కార్యనిర్వహణాధికారి శ్రీ జల్లేపల్లి వెంకటరావు దంపతులు స్వయంగా భక్తులకు ప్రసాదంగా స్వీటు కదంబం దద్దోజనం వడ్డించి సేవాభావాన్ని చాటుకున్నారు.

ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ జల్లేపల్లి వెంకటరావు గారి ఆదేశాల మేరకు భక్తులకు పాలు, మజ్జిగ, బిస్కెట్లు పంపిణీ చేసి సేవలు అందించారు. భక్తుల ఆరోగ్యం, సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించారు.
అనంతరం శ్రీ స్వామివారి నిత్య అన్నప్రసాద వితరణ కేంద్రంలో కార్యనిర్వహణాధికారి శ్రీ జల్లేపల్లి వెంకటరావు దంపతులు స్వయంగా భక్తులకు ప్రసాదంగా స్వీటు కదంబం దద్దోజనం వడ్డించి సేవాభావాన్ని చాటుకున్నారు.
ఈ సందర్భంగా భక్తులు ఈవో దంపతులకు కృతజ్ఞతలు తెలియజేసి, దేవస్థానం చేపడుతున్న సేవలను అభినందించారు.
ఈ కార్యక్రమంలో అన్నదానం సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ వాడ్రేవు రమణమూర్తి, పర్యవేక్షణాధికారి శ్రీ నర్సింగరావు, దేవస్థానం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment