*శ్రీ సత్యసాయి సేవా సంస్థల సేవా స్ఫూర్తి ఆదర్శనీయం భగవాన్ శ్రీ సత్య సాయి పోలీస్ బూత్ ప్రారంభించిన విజయవాడ ఎమ్మెల్యే శ్రీ బొండా ఉమామహేశ్వరరావు*
విజయవాడ, జూలై 19: విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే శ్రీ బొండా ఉమామహేశ్వరరావు గారు, శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో కొత్త వంతెన సెంటర్ లో ఉన్న భగవాన్ శ్రీ సత్య సాయి సర్కిల్ లో ఏర్పాటు చేసిన శ్రీ సత్య సాయి పోలీస్ బూత్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు అవసరంలో ఉన్న ప్రజలకు ఎల్లప్పుడూ ముందుండి సేవలందిస్తున్నాయని కొనియాడారు.
ప్రకృతి వైపరీత్యాలు, వైద్య సేవలు, విద్యార్థులకు సహాయం, సమాజ శ్రేయస్సు కోసం చేపడుతున్న వివిధ సేవా కార్యక్రమాలలో సంస్థ నిస్వార్థ సేవాభావంతో పనిచేస్తోందని అన్నారు.
విజయవాడ సింగుపురం ప్రాంతం లో వరదల సమయంలో శ్రీ సత్యసాయి సేవా సంస్థల సేవాదళ్ సభ్యులు అందించిన విశిష్ట సేవలను ఆయన ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు.
శ్రీ ఆర్. జె. రత్నాకర్ గారు, శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ, శ్రీ ఆర్. లక్ష్మణరావు గారు, ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షులు, ఇతర రాష్ట్ర, జిల్లా పదాధికారులు మరియు వందలాది మంది సేవాదళ్ సభ్యులు రాత్రింబవళ్లు శ్రమించి వరద బాధితులకు అండగా నిలిచారని ప్రశంసించారు.
సమాజం శ్రేయస్సు కోసం నిత్యం నిస్వార్ధంగా శ్రమించే శ్రీ సత్య సాయి సేవా సంస్థలకు తమ సహకారం ఎప్పుడూ ఉంటుందని తెలియచేసారు.
*భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు 06. 04. 1983 లో విజయవాడ విచ్చేసిన పవిత్ర ప్రదేశంలోనే* ఈ పోలీస్ అసిస్టెన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేయడం అత్యంత ఆనందదాయకమైన, గర్వించదగ్గ విషయమని శ్రీ బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు.
"అందరినీ ప్రేమించండి – అందరినీ సేవించండి", "ఎల్లప్పుడూ సహాయం చేయండి – ఎవరినీ బాధించవద్దు" అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా బోధనలను ఆచరణలో చూపిస్తున్న శ్రీ సత్యసాయి సేవా సంస్థలను ఆయన అభినందించారు.
ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి సేవా సంస్థల జాతీయ సేవా విభాగ సమన్వయకర్త ఎస్. కోటేశ్వరరావు, రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఆర్.లక్ష్మణరావు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు శ్రీ జి.సాయి విశ్వనాథంలు ఎమ్మెల్యే ఉమను సత్కరించి బాబా చిత్రపటాన్ని బహుకరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ Ch. సురేంద్ర,రాష్ట్ర సేవా విభాగ సమన్వయకర్త శ్రీ కొమరగిరి శ్యాంప్రసాద్, స్థానిక శ్రీ సత్యసాయి సేవా సమితి కన్వీనర్ ఎన్
వి.ఎల్.నరసింహారావు, రాష్ట్ర, జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల పదాధికారులు పాల్గొన్నారు





Comments
Post a Comment