K.V.SHARMA EDITOR
జగన్నాథ స్వామి వారి రథయాత్ర మహోత్సవాలలో భాగంగా శనివారం తొలి ఏకాదశి పర్వదినం నాడు స్వామి వారు శేష పాన్పు పై కొలువుదీరి భక్తులందరికీ దర్శనమిచ్చారు. తొలి ఏకాదశి పైగా శనివారం వలన భక్తులు ఉదయం నుండే స్వామివారిని దర్శించుకునేందుకు క్యూ లైన్లలో బారులు తీరారు. ఆంధ్ర ప్రదేశ్ హోమ్ శాఖా మాత్యులు శ్రీమతి వంగలపూడి అనిత గారు శ్రీ పాండురంగ స్వామి దేవస్థానం, పాయకరావుపేట తరపున జగన్నాథ స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించారు.
వారికి పూర్తి మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి వేదాశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందచేశారు. అనంతరం శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం, బురుజుపేట నుంచి ఈఓ ఎన్ సుజాత గారు మరియు ధర్మకర్తల మండలి సభ్యులు పట్టు వస్త్రాలను సమర్పించారు. మధ్యాహ్నం 1500 మందికి అన్న ప్రసాద వితరణ జరిగింది. సాయంత్రం ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ శ్రీ సీతంరాజు సుధాకర్ గారు స్వామి వారిని దర్శించుకున్నారు.
రేపు ఉదయం 9:00 గంటలకు బలభద్ర సుభద్ర సమేత జగన్నాథ స్వామి వారిని రథం మీద వేంచేసి భక్తులకు దర్శనాలు కల్పిస్తారు. సాయంత్రం 4:20 గంటలకు దక్షిణ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ వంశీ కృష్ణ శ్రీనివాస్ గారిచే తిరుగు రథయాత్ర ప్రారంభవుతుంది.


Comments
Post a Comment