Skip to main content

ఆంధ్ర విశ్వవిద్యాలయం హిందీ విభాగాన్ని సందర్శించిన షాంఘై తెలుగు సంఘం అధ్యక్షులు, ప్రముఖ శాస్త్రవేత్త డా. కోలన్ మాధవ్ రెడ్డి

.                    K.V.SHARMA EDITOR 
ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం, జూలై 8:చైనాలోని షాంఘై  జియో  టోంగ్  యూనివర్సిటీ ( Shanghai Jiao Tong University )  లో మెటీరియల్స్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ పాఠశాలలో శాశ్వత అసోసియేట్ ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్న ప్రముఖ శాస్త్రవేత్త డా. కోలన్ మాధవ్ రెడ్డి ఆంధ్ర విశ్వవిద్యాలయం హిందీ విభాగాన్ని మర్యాదపూర్వకంగా సందర్శించారు.

ఈ సందర్భంగా హిందీ విభాగ  అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు మరియు విద్యార్థులతో ఆయన సుదీర్ఘంగా సమావేశమయ్యారు. ఉన్నత విద్య, అంతర్జాతీయ పరిశోధన అవకాశాలు, పరిశోధనలో నాణ్యత, అంతరశాఖ అధ్యయనాల ప్రాధాన్యం, ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాలలో విద్యా మరియు పరిశోధనా విధానాలపై విలువైన సూచనలు చేశారు.

విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని పరిశోధనా దృక్పథంతో ముందుకు సాగాలని, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభను చాటేలా కృషి చేయాలని ఆయన సూచించారు. పరిశోధక విద్యార్థులు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ వినూత్న పరిశోధనలు చేపట్టాలని, అధ్యాపకులు పరిశోధన, బోధన మరియు అకాడమిక్ సహకారాలను మరింత విస్తరించాలని ఆకాంక్షించారు.

డా. కోలన్ మాధవ్ రెడ్డి 100కు పైగా అంతర్జాతీయ పరిశోధనా వ్యాసాలను ప్రచురించిన ప్రముఖ శాస్త్రవేత్త. ఆయన సంపాదకత్వంలో " బోరాన్  కార్బైడ్ : స్ట్రక్చర్ , ప్రాసెసింగ్ , ప్రాపర్టీస్  అండ్  అప్లికేషన్స్ " ( Boron Carbide: Structure, Processing, Properties and Applications ) గ్రంథం వెలువడింది. 2017లో డా. ఆర్. ఎల్. ఠాకూర్ మెమోరియల్ (యంగ్ సైంటిస్ట్) అవార్డును అందుకున్నారు. 2021లో ఆయన బోధించిన ఫండమెంటల్స్  అఫ్   మెటీరియల్స్  సైన్స్ ( Fundamentals of Materials Science ) కోర్సు Courseraలో ప్రచురించబడింది.

ఈ సందర్శన హిందీ విభాగాధ్యక్షులు ఆచార్య నల్లా సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో హిందీ విభాగ విద్యార్థులు, పరిశోధకులు మరియు అధ్యాపకులకు విశేష ప్రేరణను అందించడంతో పాటు అంతర్జాతీయ విద్యా, పరిశోధనా సహకారాలపై అవగాహన పెంపొందించేందుకు దోహదపడిందని  పద్మభూషణ్ ఆచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ గారు పేర్కొన్నారు.

Prof .N. Satyanarayana 

Ph: 94410 70226

Comments