శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం, సింహాచలం. గిరి ప్రదక్షిణకు స్వామివారి ప్రచార రథం ట్రయల్ రన్
. K.V.SHARMA EDITOR
తేదీ: 23 జూలై 2026 ఈ నెల 28వ తేదీన నిర్వహించనున్న సింహాచలం గిరి ప్రదక్షిణను పురస్కరించుకుని స్వామివారి ప్రచార రథానికి గురువారం ట్రయల్ రన్ నిర్వహించారు.
ఆలయ కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకటరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బండారు రాంబాబు ఆధ్వర్యంలో గ్యారేజీలో సిద్ధంగా ఉన్న స్వామివారి ప్రచార రథాన్ని తొలి పావంచ ప్రాంతానికి తీసుకువచ్చారు. అక్కడి నుంచి గిరి ప్రదక్షిణ మార్గంలో కొంతమేర రథాన్ని నడిపి ట్రయల్ రన్ నిర్వహించారు
గిరి ప్రదక్షిణ సందర్భంగా రథం సజావుగా, భద్రంగా ప్రయాణించేలా రహదారి పరిస్థితులు, మలుపులు, మార్గంలోని ఇతర అంశాలను అధికారులు పరిశీలించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, గిరి ప్రదక్షిణను విజయవంతంగా నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లను సమన్వయంతో చేపడుతున్నారు.
ఈ కార్యక్రమంలో దేవస్థానం ఇంజినీరింగ్ విభాగం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


Comments
Post a Comment