Skip to main content

ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీకి ముందు అన్ని నిబంధనలు పరిశీలించండి . -జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్.

.                   K.V.SHARMA EDITOR 
విశాఖపట్నం, జూలై 31: అపార్ట్‌మెంట్‌లకు, బహుళ అంతస్తుల భవనాలకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీ చేసే ముందు తప్పనిసరిగా అన్ని అనుమతులు, ధ్రువపత్రాలు, సౌకర్యాలను క్షుణ్ణంగా పరిశీలించాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ జీవీఎంసీ పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. 


శుక్రవారం ఆయన జీవీఎంసీ పరిధిలోని తూర్పు జోన్ శివాజీ పాలెం రోడ్డులో ఉన్న ఒక అపార్ట్‌మెంట్‌ను జీవీఎంసీ సిటీ ప్లానర్ ధనుంజయ రెడ్డి, డిప్యూటీ సిటీ ప్లానర్ హరిదాసు, టిపిఓ ప్రమీలతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.


ఈ సందర్భంగా జీవీఎంసీ కమిషనర్ ఫైర్ సేఫ్టీ అనుమతి, స్ట్రక్చరల్ స్టెబిలిటీ సర్టిఫికెట్, ఆమోదిత భవన నిర్మాణ ప్రణాళిక, కంప్లీషన్ నోటీస్, లిఫ్ట్ ఇన్‌స్టాలేషన్ సర్టిఫికెట్, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి అనుమతులు తదితర పత్రాలు పూర్తిస్థాయిలో ఉన్నాయా లేదా అనే అంశాలను కమిషనర్ స్వయంగా పరిశీలించారు.


ఈ సందర్భంగా జీవీఎంసీ కమిషనర్ మాట్లాడుతూ సోలార్ విద్యుత్ వ్యవస్థ, రైన్‌వాటర్ హార్వెస్టింగ్ సెట్ బ్యాక్, డ్రైనేజీ సిస్టం, పచ్చదనం పెంపొందించడం మొదలైనవి సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించి వారికి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ జారీ చేయాలని పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు.

పౌర సంబంధాల అధికారి,జివిఎంసి.

Comments

Popular posts from this blog

*శ్రీ సత్యసాయి సేవా సంస్థలు – విశాఖపట్నం జిల్లా* *ప్రేమ సేవగా తలవంచిన వేళ — గిరి ప్రదక్షిణ భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కల్పించిన శ్రీ సత్యసాయి సేవాదళ్- గిరి ప్రదక్షిణ మార్గంలో వేలాది మంది భక్తులకు ప్రేమతో, నిస్వార్థంగా సేవలందించిన విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు*

విశాఖపట్నం :29 జులై 2026: పవిత్రమైన గురుపూర్ణిమ సందర్భంగా సింహాచల క్షేత్ర ఆరాధ్యదైవం, కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న లక్షలాది మంది భక్తులకు విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు విస్తృతమైన సేవా కార్యక్రమాలను ప్రేమతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించాయి. విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సింహాచలం సమితి, గోపాలపట్నం భజన మండలి ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణకు విచ్చేసిన భక్తులకు 28 జులై 2026 ఉదయం నుంచే సేవా కార్యక్రమాలు ప్రారంభమై, రాత్రంతా కొనసాగి 29 జులై 2026 ఉదయం 7 గంటల వరకు నిర్వహించబడ్డాయి. *అలసిన భక్తుల పాదాలకు ప్రేమతో ఉపశమనం — ప్రత్యేక సేవ* గిరి ప్రదక్షిణలో ఎంతో దూరం నడిచి అలసిపోయిన భక్తుల పాదాలకు ఉపశమనం కల్పించేందుకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చేపట్టిన ప్రత్యేక పాద మర్దన సేవ అందరి హృదయాలను స్పృశించింది. భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కలిగించేందుకు నువ్వుల నూనెలో ప్రత్యేక వనమూలికలను మరిగించి తయారుచేసిన నూనెను శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రత్యేకంగా సిద్ధం చేయించాయి. శ్రీ సత్యసాయి మహిళా మరియు పురుష సేవాదళ్ సభ్యులు స్వయంగా భక్...