జర్నలిస్టులు సమాజ ప్రగతి సాధకులు* *పాత్రికేయుల సమస్యలు పరిష్కారానికి సహకారం* *ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ సమావేశంలో* *పద్మనాభం తాసిల్దార్ దాడిశెట్టి శైలజ .. సి ఐ చంద్ర మౌళి*
పద్మనాభం జూలై 21జర్నలిస్టుల సమస్యలు పరిష్కారానికి తమ వంతు సంపూర్ణ సహకారం అందిస్తామని పద్మనాభం మండల తాసిల్దార్ దాడిశెట్టి శైలజ . స్థానిక. సీఐ మీసాల చంద్రమౌళి హామీ ఇచ్చారు.. మంగళవారం పద్మనాభం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఆధ్వర్యంలో మండల పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా
వీరు మాట్లాడుతూ జర్నలిస్టులతోనే ప్రజా సమస్యలు పరిష్కరించడానికి అవకాశం కలుగుతుందన్నారు.. నిరంతరం కష్టపడి గ్రామీణ ప్రాంతాల ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి ఎంతగానో కృషి చేస్తున్నారని కొనియాడారు.. అలాగే జర్నలిస్టులకు ప్రభుత్వం నియమ నిబంధనల ప్రకారం
ఇళ్ల స్థలాలు ఇండ్లు కేటాయించేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు.. పాత్రికేయులు అందరూ సమన్వయంతో ముందుకు సాగుతూ సమాజ ప్రగతికి మరింతగా తోడ్పాటు అందించాలని వారు ఆకాంక్షించారు..
సమావేశంలో జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టులు ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ నగరంతో పాటు గ్రామీణ ప్రాంత జర్నలిస్టులకు తమ వంతు అండగా ఉంటామన్నారు.. వారికి అవసరమైన అక్రిడేషన్లు .. హెల్త్ ఇన్సూరెన్స్. ఇళ్ల స్థలాలు వంటి సమస్యలు పరిష్కారానికి యూనియన్ పరంగా సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు.. పద్మనాభం మండల రిపోర్టర్లు ఐక్యంగా ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారని కొనియాడారు . విశాఖ జిల్లా అధ్యక్షులు పి నారాయణ ప్రధాన కార్యదర్శి జి శ్రీనివాస్ రావు లు మాట్లాడుతూ
జిల్లాలో అన్ని మండలాల్లో పర్యటిస్తూ జర్నలిస్టుల సమస్యలు పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తున్నామన్నారు.. ఈ ఏడాది సుమారు 800 మంది జర్నలిస్టులు తమ యూనియన్ లో సభ్యత్వం స్వీకరించారు అన్నారు.. ఈ సమావేశానికి పద్మనాభం ఫెడరేషన్ నాయకులు కే సత్యనారాయణ
సభాధ్యక్షత వహించి.. స్థానికంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు.. అలాగే ప్రస్తుత ఎంపీపీ రాంబాబు మాజీ ఎంపీపీ గోపిరాజు.. స్థానిక ఫెడరేషన్ నాయకులు కే తులసీదాసు.. బి ప్రసాద్.. కే త్రినాథ్.. పి రాజు . ఏ దేవుడు.. బి అప్పలనాయుడు.. రంగధామారావు
విశాఖ జిల్లా.. బ్రాడ్ కాస్ట్ అధ్యక్ష కార్యదర్శులు ఇరోతి ఈశ్వరరావు.. కింతాడ మదన్ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్మోహన్.. కార్యదర్శి కే శ్రీనివాసరావు.. ఇతర ప్రతినిధులు హరి. బొబ్బర ప్రసాద్.. ఫెడరేషన్ ఉపాధ్యక్షులు నగేష్ బాబు. స్థానిక పాత్రికేయులు





Comments
Post a Comment