శ్రీ శ్రీ శ్రీ వరాహలక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం, సింహాచలం. సింహాచలం స్వామివారిని దర్శించుకున్న విశాఖ జాయింట్ కలెక్టర్ విద్యాధరి దంపతులు.
సింహాచలం తేదీ: 08 జూలై 2026 విశాఖపట్నం జిల్లా జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ళ విద్యాధరి ఐఏఎస్ దంపతులు బుధవారం శ్రీ వరాహలక్ష్మీనరసింహస్వామి వారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకట్రావు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. నాదస్వర మంగళవాయిద్యాలు, వేదపండితుల వేదమంత్రోచ్చారణల నడుమ ఆలయంలోకి ఆహ్వానించారు. అనంతరం సంప్రదాయం ప్రకారం స్వామివారి కప్పస్తంభాన్ని ఆలింగనం చేసిన జాయింట్ కలెక్టర్ దంపతులు, గర్భాలయంలో స్వామివారిని దర్శించుకుని,
దర్శనానంతరం వేదపండితులు వేదాశీర్వచనం అందించగా, ఆలయ కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకట్రావు స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి, స్వామివారి ప్రసాదాలతో పాటు స్వామివారి చిత్రపటాన్ని జ్ఞాపికగా అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, వేదపండితులు, దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు



Comments
Post a Comment