Skip to main content

డాక్యుమెంట్ రైటర్లు సమ్మె చేస్తున్న నేపథ్యంలో ప్రజలు నేరుగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వచ్చి అన్ని రకాల రిజిస్ట్రేషన్ సేవలూ పొందవచ్చని


డాక్యుమెంట్ రైటర్లు సమ్మె చేస్తున్న నేపథ్యంలో ప్రజలు నేరుగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వచ్చిఅన్ని రకాల రిజిస్ట్రేషన్ సేవలూ పొందవచ్చని ద్వారకానగర్ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ డి.వి.నారాయణ, సూపర్ బజార్ రిజిస్ట్రార్ ఆఫీసు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ -1 జె.కనకరత్నం, జాయింట్ సబ్ రిజిస్ట్రార్ -2 కె.రామశ్రీను  తెలిపారు.  శనివారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సేవల విషయంలో ఎటువంటి అంతరాయం, లోపం లేదన్నారు. ప్రజలకు రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సేవల విషయంలో సిబ్బంది అన్ని విధాలా సహకరిస్తారని చెప్పారు. రిజిస్ట్రేషన్ సేవల్లో ఇబ్బందులు ఉంటే తమను నేరుగా సంప్రదించవచ్చవచ్చని తెలిపారు. గత కొన్ని రోజులుగా అనేక మంది నేరుగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వచ్చి సేవలు పొందుతున్నారని అన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించి, రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వచ్చి సేవలు పొందాలని కోరారు

Comments

Popular posts from this blog

*శ్రీ సత్యసాయి సేవా సంస్థలు – విశాఖపట్నం జిల్లా* *ప్రేమ సేవగా తలవంచిన వేళ — గిరి ప్రదక్షిణ భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కల్పించిన శ్రీ సత్యసాయి సేవాదళ్- గిరి ప్రదక్షిణ మార్గంలో వేలాది మంది భక్తులకు ప్రేమతో, నిస్వార్థంగా సేవలందించిన విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు*

విశాఖపట్నం :29 జులై 2026: పవిత్రమైన గురుపూర్ణిమ సందర్భంగా సింహాచల క్షేత్ర ఆరాధ్యదైవం, కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న లక్షలాది మంది భక్తులకు విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు విస్తృతమైన సేవా కార్యక్రమాలను ప్రేమతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించాయి. విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సింహాచలం సమితి, గోపాలపట్నం భజన మండలి ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణకు విచ్చేసిన భక్తులకు 28 జులై 2026 ఉదయం నుంచే సేవా కార్యక్రమాలు ప్రారంభమై, రాత్రంతా కొనసాగి 29 జులై 2026 ఉదయం 7 గంటల వరకు నిర్వహించబడ్డాయి. *అలసిన భక్తుల పాదాలకు ప్రేమతో ఉపశమనం — ప్రత్యేక సేవ* గిరి ప్రదక్షిణలో ఎంతో దూరం నడిచి అలసిపోయిన భక్తుల పాదాలకు ఉపశమనం కల్పించేందుకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చేపట్టిన ప్రత్యేక పాద మర్దన సేవ అందరి హృదయాలను స్పృశించింది. భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కలిగించేందుకు నువ్వుల నూనెలో ప్రత్యేక వనమూలికలను మరిగించి తయారుచేసిన నూనెను శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రత్యేకంగా సిద్ధం చేయించాయి. శ్రీ సత్యసాయి మహిళా మరియు పురుష సేవాదళ్ సభ్యులు స్వయంగా భక్...