జనాభా పరిశోధన కేంద్రం* (భారత ప్రభుత్వ జాతీయ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, న్యూఢిల్లీ ), ఆంధ్ర విశ్వవిద్యాలయం, విశాఖపట్నం ఆధ్వర్యంలో ఈరోజు (అనగా *తేదీ: 11/7/2026* న స్టాటిస్టిక్స్ విభాగం నందు ప్రపంచ జనాభా దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (IIPE), విశాఖపట్నం ఫౌండర్ డైరెక్టర్ & రిటైర్డ్ *ప్రొఫెసర్ V.S R K. ప్రసాద్ రావు* మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, పబ్లిక్ పాలసీ తదితర అంశాల్లో స్టాటిస్టిక్స్ యొక్క ప్రత్యేక ప్రాధాన్యతను వివరించారు. అంతేకాకుండా పాపులేషన్ రీసెర్చ్, సెన్సెస్ మరియు ఎన్విరాన్మెంటల్ స్టడీస్ నందు విద్యార్థులకు గల ప్రత్యేక అవకాశాలను గురించి వీటి యందు విద్యార్థులు అవకాశాలు నందిపుచ్చుకోవాలని కోరారు. అదే విధంగా ఈ ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఈ విషయం యందు యువత సస్టైనబుల్ డెవలప్మెంట్ కొరకు కృషి చేయాలని ఆకాంక్షించారు.
గౌరవ అతిథిగా విచ్చేసిన జాయింట్ డైరెక్టర్, డైరెక్టరేట్ ఆఫ్ సెన్సెస్ ఆపరేషన్స్, ఆంధ్రప్రదేశ్, *శ్రీ B.V.L. సాయి శేఖర్* మాట్లాడుతూ డెమోగ్రఫీ, పాపులేషన్ స్టడీస్, ఇతర స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్స్ లో విద్యార్థులు పరిణితి మరియు పరిజ్ఞానానికి సంబంధించి అనేక అవకాశాలు మెండుగా ఉన్నాయని వాటిని వినియోగించుకోవాలని కోరారు.
విశ్వవిద్యాలయం సైన్స్ మరియు టెక్నాలజీ కళాశాల ప్రిన్సిపాల్ *ప్రొఫెసర్ ఎం.వి ఆర్. రాజు* మాట్లాడుతూ హెల్త్, క్వాలిటీ ఎడ్యుకేషన్ మరియు సస్టైనబుల్ డెవలప్మెంట్ తదితర అంశాల గురించి ప్రస్తావిస్తూ లైఫ్ స్టైల్ డిసీజెస్ గురించి ప్రజలు అవగాహన కలిగి తదానుగుణంగా ఆహారపు అలవాట్లు మార్చుకోవాలని కోరారు. అంతేకాకుండా పర్యావరణాన్ని పరిరక్షిస్తూ దేశ అభివృద్ధిలో విద్యార్థులు భాగస్వామ్యులు కావాలని ఆకాంక్షించారు.
జనాభా పరిశోధన కేంద్రం హానరరీ డైరెక్టర్ మరియు స్టాటస్టిక్స్ విభాగాధిపతి *ఆచార్య బి. మునిస్వామి* మాట్లాడుతూ జనాభా పరిశోధన కేంద్రం ద్వారా దేశవ్యాప్తంగా వివిధ జాతీయ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ కార్యక్రమాలు అమలు తీరుపై జరుగుతున్న పరిశోధన మరియు పరిశీలన గురించి వివరిస్తూ పాపులేషన్ రీసెర్చ్ ప్రాధాన్యత మరియు ఈ ప్రపంచ జనాభా దినోత్సవ కార్యక్రమం ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావడంలో జనాభా పరిశోధన కేంద్రం పోషిస్తున్న కీలక పాత్రను గురించి సవివరంగా వివరించారు.
అనంతరం ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన *వ్యాసరచన మరియు వక్తృత్వ పోటీలలో* విజేతలుగా నిలిచిన విశ్వవిద్యాలయం మరియు విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలకు చెందిన విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేయడం జరిగింది. *రంగోలి ద్వారా, పెయింటింగ్ ద్వారా* , వ్యాసాలు రాయడం ద్వారా మరియు విద్యార్థులు వాక్చాతుర్యం ద్వారా ఈ ప్రపంచ దినోత్సవాన్ని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా వివిధ కోణాలను ప్రదర్శించడంపై అతిధులు విద్యార్థులను ప్రత్యేకంగా కొనియాడారు.
ఈ కార్యక్రమంలో పాపులేషన్ రీసెర్చ్ సెంటర్ *రీసెర్చ్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ యడ్ల రమణ* మ్యాథమెటిక్స్ విభాగం ఆచార్యులు కే. అనురాధ కామేశ్వరి, G. నానాజీ రావు, డైరెక్టరేట్ ఆఫ్ సెన్సెస్ ఆపరేషన్స్ డాక్టర్ జగన్నాధ పూరి, పరిశోధన కేంద్రం సిబ్బంది, స్టాటిస్టిక్ విభాగం బోధనేతర సిబ్బంది, పరిశోధకులు మరియు విద్యార్థులు, విశ్వవిద్యాలయంలోని పలు విభాగాలకు చెందిన విద్యార్థులు మరియు విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలకు చెందిన విద్యార్థులు సుమారు 160 మంది పాల్గొని జయప్రదం చేయడం జరిగింది.


Comments
Post a Comment