Skip to main content

వెయ్యికి పైగా రాళ్లు తొలగించిన సాయి విశ్వాస్ ఆసుపత్రి.....సాయి విశ్వాస్ ఆస్పత్రిలో అరుదైన శస్త్రచికిత్సలు..


.               SRINIVAS SPL Correspondant 
అమలాపురం..విశాఖ సందేసం...అమలాపురంలోని సాయి విశ్వాస్ ఆస్పత్రిలో వైద్యులు అరుదైన మూడు శస్త్రచికిత్సలను చేసి వెయ్యికి పైగా రాళ్లను  విజయవంతంగా తొలగించి  రోగులకు ఉపశమనం కలిగించినట్లు 


సాయి విశ్వాస్ ఆస్పత్రుల అధినేత డాక్టర్ గంధం విశ్వనాథ్ తెలిపారు. ఒక రోగికి గాల్ బ్లాడర్‌లో ఉన్న వెయ్యికి పైగా చిన్నరాళ్లను తొలగించగా,మరొకరికి పెద్దవి 150కి పైగా రాళ్లను శస్త్ర  చికిత్స ద్వారా  బయటకు తీశారు. గాల్ బ్లాడర్,కిడ్నీ సంబంధిత తీవ్రమైన సమస్యలతో బాధ పడుతున్న రోగులు అత్యవసరంగా ఆస్పత్రిలో చేరగా,వారికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం శస్త్రచికిత్స అవసరమని వైద్యులు నిర్ధారించారు. 


ఇందులో ఇద్దరికీ గాల్ బ్లాడర్‌లో అత్యధిక సంఖ్యలో రాళ్లు ఉండటాన్ని గుర్తించి శస్త్రచికిత్స ద్వారా వాటిని తొలగించారు. మరో రోగికి కిడ్నీ అంత పొడవున్నరాడును రాయి మాదిరిగా మారిపోవడంతో ప్రత్యేక పద్ధతిలో శస్త్రచికిత్స నిర్వహించి రాళ్లను  తొలగించారు. ప్రస్తుతం ఇద్దరు రోగుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈసందర్భంగా సాయి విశ్వాస్ ఆస్పత్రుల అధినేత డాక్టర్ గంధం విశ్వనాథ్ 


మాట్లాడుతూ,మారుతున్న ఆహారపు అలవాట్లు, తగినంత నీరు తాగకపోవడం,అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా కిడ్నీ తోపాటు గాల్ బ్లాడర్ లో సంబంధిత వ్యాధులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.  ముఖ్యంగా,తరచూ మూత్ర విసర్జన చేయాల్సివస్తుందనే కారణంతో చాలా మంది మంచినీరు తాగడాన్ని తగ్గిస్తున్నారన్నారు. ప్రతిరోజూ తగిన మోతాదులో స్వచ్ఛమైన నీటిని తీసుకోవడం ద్వారా కిడ్నీతో పాటు గాల్ బ్లాడర్ లో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చని,అనేక అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చని ఆయన సూచించారు. ప్రజలు ఆరోగ్యపు అలవాట్లను అలవార్చుకోవాలన్నారు.

Comments