Skip to main content

భారతరత్న, మాజీ రాష్ట్రపతి, "మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా" డాక్టర్ ఎ.పి.జె. అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా విశాఖపట్నం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు.


ఈ కార్యక్రమంలో విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ కె.కె. రాజు గారు పార్టీ నాయకులతో కలిసి పాల్గొని డాక్టర్ అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, సామాన్య కుటుంబం నుంచి దేశ అత్యున్నత పదవిని అధిరోహించిన డాక్టర్ అబ్దుల్ కలాం జీవితం ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. రాష్ట్రపతి భవన్ తలుపులను సామాన్య ప్రజలకు తెరిచి, ప్రజల రాష్ట్రపతిగా గుర్తింపు పొందిన మహనీయుడని కొనియాడారు. అత్యున్నత స్థాయికి ఎదిగినా ఆయన చూపిన వినయం, నిరాడంబరత, దేశభక్తి భావం తరతరాలకు ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు. భారతదేశాన్ని అణు సాంకేతికత, రాకెట్ విజ్ఞాన రంగాల్లో ప్రపంచ దేశాల సరసన నిలబెట్టడంలో డాక్టర్ కలాం కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. అగ్ని, పృథ్వి వంటి క్షిపణుల అభివృద్ధిలో ఆయన చేసిన సేవలు దేశ రక్షణ రంగాన్ని ఆత్మనిర్భరంగా తీర్చిదిద్దాయని కొనియాడారు. "కలలు కనండి... వాటిని నిజం చేసుకునేందుకు నిరంతరం శ్రమించండి" అనే డాక్టర్ కలాం సందేశం నేటికీ యువతకు మార్గదర్శకంగా నిలుస్తోందని పేర్కొన్నారు. విద్యకు ఆయన ఇచ్చిన ప్రాధాన్యతను గుర్తు చేస్తూ, అదే స్ఫూర్తితో మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు తన ఐదేళ్ల పాలనలో నాడు-నేడు వంటి కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని తెలిపారు. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర విద్యారంగం పూర్తిగా దెబ్బతిన్నదని ఆరోపించారు. ముఖ్యంగా మెగా డీఎస్సీ-2026లో చోటుచేసుకున్న అవకతవకల వల్ల అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరిగిందని, నచ్చిన వారికి ఉపాధ్యాయ పోస్టులు కట్టబెట్టి విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్ అబ్దుల్ కలాం ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని, దేశాభివృద్ధి కోసం యువత విజ్ఞానాన్ని, కృషిని సమాజానికి అంకితం చేయాలని ఈ సందర్భంగా పార్టీ నాయకులు పిలుపునిచ్చారు.

ఈ సమావేశం లో సమన్వయకర్తలు తిప్పల శ్రీనివాస్ దేవన్ రెడ్డి, మొల్లి అప్పారావు, శాసన మండలి సభ్యురాలు వరుదు కళ్యాణి, మాజీ మంత్రి వర్యులు పసుపులేటి బాల రాజు, మాజీ శాసన సభ్యులు తైనాల విజయ కుమార్, తిప్పల గురుమూర్తి రెడ్డి, చింతలపూడి వెంకట రామయ్య,పార్టీ పర్యవేక్షకులు గుడిమెట్ల రవి రెడ్డి,  పార్టీ నాయుకులు జహీర్ అహ్మద్, చింతకాయల సన్యాసి పాత్రుడు, వీసం రామ కృష్ణ, పెడాడ రమణి కుమారి, కోల గురువులు, యెడ్డు దేముడు, జియ్యాని శ్రీధర్, కొట్టమురి సతీష్ , బాణాల శ్రీనివాసరావు, పిన్నమరాజు సతీష్ వర్మ, కొండా రాజీవ్ గాంధీ, పరిసా వేంకట నారాయణ, తాడి జగన్నాధ రెడ్డి, కిరణ్ రాజు, కోరుకొండ వెంకట రత్న స్వాతి, పల్లా దుర్గారావు, గుడ్ల వెంకట రమణి రెడ్డి, గొందేశి మహేశ్వర రెడ్డి, లింగం శ్రీనివాస్, ప్రసాద్ రాజు, బొల్లవరపు జాన్ వెస్లీ, పెర్ల విజయ చందర్, గండ్రాజు వెంకట రవిరాజు, చెన్నా జానకి రామ్, జీలకర్ర నాగేంద్ర , ద్రోణంరాజు శ్రీ వాస్తవా, సేనాపతి అప్పారావు, అంబటి నాగ వినాయక శైలేష్, పివి సురేష్, తుమ్మలూరు జగదేష్ రెడ్డి, వూరుకూటి రామ చంద్రరావు (చందు), సనపల రవీంద్ర భరత్, బోని శివ రామకృష్ణ, కటికల కల్పన, మేడి బాజీ నాయుడు, రాయపురెడ్డి అనిల్ కుమార్, కర్రి రామా రెడ్డి, శ్రీదేవి వర్మ పెనంత్స, వంకాయల మారుతీ ప్రసాద్, వడ్డాది దీలిప్ కుమార్, సకలభక్తుల ప్రసాద్ రావు, బోండా ఉమా మహేశ్వర రావు, మనోజ్ కుమార్ గొడబా, చిక్కాల సత్యనారాయణ, గొలగాని శ్రీనివాస్, మువ్వల సురేష్ , పిల్ల కన్న బాబు, గానగల్ల రామరాజు తదితరాలు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

*శ్రీ సత్యసాయి సేవా సంస్థలు – విశాఖపట్నం జిల్లా* *ప్రేమ సేవగా తలవంచిన వేళ — గిరి ప్రదక్షిణ భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కల్పించిన శ్రీ సత్యసాయి సేవాదళ్- గిరి ప్రదక్షిణ మార్గంలో వేలాది మంది భక్తులకు ప్రేమతో, నిస్వార్థంగా సేవలందించిన విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు*

విశాఖపట్నం :29 జులై 2026: పవిత్రమైన గురుపూర్ణిమ సందర్భంగా సింహాచల క్షేత్ర ఆరాధ్యదైవం, కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న లక్షలాది మంది భక్తులకు విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు విస్తృతమైన సేవా కార్యక్రమాలను ప్రేమతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించాయి. విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సింహాచలం సమితి, గోపాలపట్నం భజన మండలి ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణకు విచ్చేసిన భక్తులకు 28 జులై 2026 ఉదయం నుంచే సేవా కార్యక్రమాలు ప్రారంభమై, రాత్రంతా కొనసాగి 29 జులై 2026 ఉదయం 7 గంటల వరకు నిర్వహించబడ్డాయి. *అలసిన భక్తుల పాదాలకు ప్రేమతో ఉపశమనం — ప్రత్యేక సేవ* గిరి ప్రదక్షిణలో ఎంతో దూరం నడిచి అలసిపోయిన భక్తుల పాదాలకు ఉపశమనం కల్పించేందుకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చేపట్టిన ప్రత్యేక పాద మర్దన సేవ అందరి హృదయాలను స్పృశించింది. భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కలిగించేందుకు నువ్వుల నూనెలో ప్రత్యేక వనమూలికలను మరిగించి తయారుచేసిన నూనెను శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రత్యేకంగా సిద్ధం చేయించాయి. శ్రీ సత్యసాయి మహిళా మరియు పురుష సేవాదళ్ సభ్యులు స్వయంగా భక్...