Skip to main content

నీట్ అడ్మిషన్లలో పారదర్శకత, గ్రామీణ విద్యార్థుల అవకాశాలపై కేంద్రాన్ని ప్రశ్నించిన ఎంపీ గురుమూర్తి

.                   K.V.SHARMA EDITOR 
 న్యూఢిల్లీ, జూలై 24: వైద్య విద్యలో ప్రవేశాలకు అమలవుతున్న నీట్ విధానం గ్రామీణ ప్రాంతాలు, ప్రాంతీయ భాషల్లో చదివిన విద్యార్థులపై చూపుతున్న ప్రభావంపై తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి లోక్‌సభలో ప్రశ్నించారు. నీట్ కారణంగా వైద్య సీట్ల లభ్యతపై ప్రభుత్వం సమీక్ష నిర్వహించిందా, రాష్ట్రాలకు ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రవేశాల్లో మరింత వెసులుబాటు కల్పించాలని ఏవైనా విజ్ఞప్తులు వచ్చాయా, గత ఐదేళ్లలో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఎన్ని ఎంబీబీఎస్ సీట్లు పెరిగాయో, అలాగే దేశవ్యాప్తంగా న్యాయమైన, పారదర్శకమైన అడ్మిషన్ విధానాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటో తెలపాలని కోరారు.


ఈ ప్రశ్నకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) చట్టం–2019 ప్రకారం ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు నీట్ (యూజీ)నే దేశవ్యాప్తంగా ఉమ్మడి ప్రవేశ పరీక్షగా కొనసాగుతున్నట్లు తెలిపారు. విద్యార్థుల సౌలభ్యం కోసం ఇంగ్లీష్, హిందీతో పాటు తెలుగు సహా మొత్తం 13 భాషల్లో నీట్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. దేశంలో వైద్య విద్య అవకాశాలను విస్తరించేందుకు ప్రభుత్వం ఎంబీబీఎస్ సీట్లను గణనీయంగా పెంచినట్లు ఆయన తెలిపారు.


2022–23లో 99,463గా ఉన్న మొత్తం ఎంబీబీఎస్ సీట్లు 2026–27 నాటికి 1,39,489కు పెరిగినట్లు పేర్కొంది. గత ఐదేళ్లలో మొత్తం 40,026 ఎంబీబీఎస్ సీట్లు పెరిగినట్లు సమాధానంలో పేర్కొన్నారు. అలాగే, ఎంసీసీ (మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ) ద్వారా అఖిల భారత కోటా, ఎయిమ్స్,జిప్మర్, కేంద్ర విశ్వవిద్యాలయాలు, డీమ్డ్ విశ్వవిద్యాలయాల సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహిస్తుండగా, రాష్ట్ర కోటా సీట్లకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే రాష్ట్రాలకు ప్రవేశాల్లో మరింత వెసులుబాటు కల్పించాలన్న అంశంపై ఎలాంటి నిర్ణయం లేదా మార్పును ప్రభుత్వం ప్రకటించలేదని తెలిపారు.

Comments

Popular posts from this blog

*శ్రీ సత్యసాయి సేవా సంస్థలు – విశాఖపట్నం జిల్లా* *ప్రేమ సేవగా తలవంచిన వేళ — గిరి ప్రదక్షిణ భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కల్పించిన శ్రీ సత్యసాయి సేవాదళ్- గిరి ప్రదక్షిణ మార్గంలో వేలాది మంది భక్తులకు ప్రేమతో, నిస్వార్థంగా సేవలందించిన విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు*

విశాఖపట్నం :29 జులై 2026: పవిత్రమైన గురుపూర్ణిమ సందర్భంగా సింహాచల క్షేత్ర ఆరాధ్యదైవం, కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న లక్షలాది మంది భక్తులకు విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు విస్తృతమైన సేవా కార్యక్రమాలను ప్రేమతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించాయి. విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సింహాచలం సమితి, గోపాలపట్నం భజన మండలి ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణకు విచ్చేసిన భక్తులకు 28 జులై 2026 ఉదయం నుంచే సేవా కార్యక్రమాలు ప్రారంభమై, రాత్రంతా కొనసాగి 29 జులై 2026 ఉదయం 7 గంటల వరకు నిర్వహించబడ్డాయి. *అలసిన భక్తుల పాదాలకు ప్రేమతో ఉపశమనం — ప్రత్యేక సేవ* గిరి ప్రదక్షిణలో ఎంతో దూరం నడిచి అలసిపోయిన భక్తుల పాదాలకు ఉపశమనం కల్పించేందుకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చేపట్టిన ప్రత్యేక పాద మర్దన సేవ అందరి హృదయాలను స్పృశించింది. భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కలిగించేందుకు నువ్వుల నూనెలో ప్రత్యేక వనమూలికలను మరిగించి తయారుచేసిన నూనెను శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రత్యేకంగా సిద్ధం చేయించాయి. శ్రీ సత్యసాయి మహిళా మరియు పురుష సేవాదళ్ సభ్యులు స్వయంగా భక్...