Skip to main content

ఏయూను సంద‌ర్శించిన టెక్సాస్ ఏ అండ్ ఎం యూనివ‌ర్సిటీ ఆచార్యుడు

.                    K.V.SHARMA EDITOR 
ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం, జూలై 22:ఆంధ్రవిశ్వవిద్యాలయం హ్యూమన్ జెనిటిక్స్ విభాగ  పూర్వ విద్యార్థి, టెక్సాస్ ఏ అండ్ ఏం యూనివర్సిటీ హ్యూమన్ జెనిటిక్స్ విభాగం ఆచార్యుడు డా రవీంద్రనాథ్ దుగ్గిరాల ఏయూను సందర్శించారు. ఈ సందర్భంగా  ఆంధ్ర విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య జి.పి.రాజశేఖర్ ను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలసి ఉత్తర అమెరికాలో జరగనున్న ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరుకావాలని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఏం.వి.ఆర్.రాజు, హ్యూమన్ జెనిటిక్స్ విభాగం అధిపతి ఆచార్య వి.లక్ష్మి,  విభాగపు ఆచార్యులు జి.పద్దయ్య, జి.సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఆటిజం డిజార్డ‌ర్‌పై ఆంధ్ర విశ్వ‌విద్యాల‌యం జెనిటిక్స్‌, సైకాల‌జి విభాగాల‌తో క‌లిసి ప‌రిశోధ‌న‌లు చేసే దిశ‌గా ఈ సంద‌ర్భంగా చ‌ర్చించారు.

Comments